గన్‌మెన్లు లేకుండానే జనాల్లోకి రేవంత్ రెడ్డి.. కారణం ఏంటంటే?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది.

Revanth Reddy:వేంకటేశ్వరుడి ముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు..రేవంత్ ప్రత్యేక పూజలు
New Update

టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది విధులకు గైర్హాజయ్యారు. నలుగురు గన్‌మెన్‌లతో రాచకొండ పోలీసులు రేవంత్‌కి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయితే ఇటీవల రేవంత్ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెక్యూరిటీ విధులకు డుమ్మా కొట్టారు. తాము రేవంత్ దగ్గర పనిచేయలేమని ఉన్నతాధికారులకు చెప్పడంతో వేరే సిబ్బంది పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్క గన్‌మెన్‌ను కూడా నువ్వు కూడా ఎందుకు వెళ్లిపో అని రేవంత్ చెప్పడంతో అతను కూడా రావడం లేదని సమాచారం. దీంతో సెక్యూరిటీ లేకుండానే రెండు రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై నాగర్ కర్నూలులో కేసు కూడా నమోదైంది.

అసలు ఏం జరిగిదంటే?

ఆగస్టు 14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరిని గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరించారు. కొంత మంది పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటున్నాన‌ని, అధికారంలోకి వచ్చాక వాళ్ల పనిచెబుతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా చట్టానికి లోబడి పనిచేస్తామని.. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌పై భూత్పూర్, జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ల‎లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. పోలీసులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగర్‌కర్నూలు జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్‌లపైనా పోలీసులు కేసు నమోదు చేశారు

ఇక రేవంత్ రెడ్డి రెండు నెలల క్రితమే తనకు సెక్యూరిటీ కావాలని కోర్టును ఆశ్రయించారు. 69 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ఈ మేరకు ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలుత 4+ 4 గన్‌మెన్లు ఉండగా, ఇటీవల ప్రభుత్వం 2+2కు కుదించింది. తాజాగా బుధవారం నుంచి మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది కూడా డుమ్మా కొట్టారు. ప్రస్తుతం రేవంత్ సెక్యూరిటీ తొలగింపు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe