నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కవులు, కళాకారులను ప్రభుత్వం తరపున గౌరవిస్తామన్నారు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన ప్రజాకోర్టులో ‘‘తిరగబడదాం, తరిమికొడదాం’’ ఛార్జ్‌షీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

New Update
నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తాం: రేవంత్ రెడ్డి

తిరగబడదాం, తరిమికొడదాం..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ పదవి లేకుండా ప్రజల కోసం అన్ని దశాబ్దాలు కోట్లాడిన వ్యక్తి గద్దర్ మాత్రమే అన్నారు. గద్దర్ పేరు చిరస్థాయిలో నిలిచేలా ట్యాంక్‌బండ్‌‌పై గద్దర్ విగ్రహం పెడతామని పేర్కొన్నారు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాకోర్టులో ‘‘తిరగబడదాం, తరిమికొడదాం’’ ఛార్జ్‌షీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య కేసీఆర్ ప్రభుత్వంపై తీర్పు చెప్పారు.

తెలంగాణ ద్రోహి కేసీఆర్..

అనంతరం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ నష్టపోవడంలో కేసీఆర్ మొదటి ముద్దాయి అన్నారు. తెలంగాణ పదమే ఇష్టం లేక పార్టీ పేరు మార్చుకున్న కేసీఆర్‌కు తెలంగాణకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకు విలువ ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన కేసీఆర్.. తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై కేసీఆర్ దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ప్రజా కోర్టు తెలంగాణ కాంగ్రెస్ థీమ్..

కాంగ్రెస్ మోసం చేసిందని కేసీఆర్ అంటే అందులో కేసీఆర్ ఉన్నారు.. తెలుగుదేశం మోసం చేసింది అంటే అందులోనూ కేసీఆర్ ఉన్నారు. టీఆర్ఎస్ మోసం చేసింది అంటే అందులోనూ కేసీఆర్ ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్, మోదీ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో బండి సంజయ్‌ని అడిగితే బాగా చెప్తారని ఎద్దేవా చేశారు. ప్రజా కోర్టు తెలంగాణ కాంగ్రెస్ థీమ్ అని.. ప్రజాకోర్టులో మోదీ, కేసీఆర్‌ను నిలబెడతామని వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేస్తారన్నారు. సోనియా గాంధీ సభలో డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.

పొత్తులపై నిర్ణయం అప్పుడే..

మంత్రి కేటీఆర్‌పై కూడా రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాదానికి, వ్యాధులకు కేటీఆర్‌కు తేడా తెలియదని విమర్శించారు. తాను ఉద్యమం చేసే సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారన్నారు. పొత్తులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై చర్చిస్తామని.. ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరపడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే జాతీయస్థాయిలోనే పొత్తులపై చర్చలు ఉంటాయన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు