Revanth Reddy: కుంభం అనిల్‌కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేత కుంభం అనిల్‌ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కుంభం అనిల్‌ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్‌ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు.

New Update
Revanth Reddy: కుంభం అనిల్‌కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: బీఆర్ఎస్ నేత కుంభం అనిల్‌ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కుంభం అనిల్‌ భువనగిరిలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కొంతమంది ఓడిపోతే పారిపోతారని.. కానీ అనిల్‌ మాత్రం కార్యకర్తలను కాపాడుకుని నిలబడ్డారన్నారు. అనిల్‌కు హైకమాండ్‌ దగ్గర మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. కొన్ని అపోహలు, గందరగోళం ఏర్పడిన సమయంలో... ఎమోషనల్‌ అయి అనిల్‌ ఒక నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్‌ జెండా మోసిన వాళ్లంతా చాలా ఇబ్బంది పడ్డారని.. ఇవన్నీ చూసిన అనిల్‌ కూడా మనసు మార్చుకున్నారన్నారు.

భువనగిరి నియోజకవర్గంపై తాము కూడా సర్వే చేయగా 99 శాతం మంది అనిల్‌కు పాజిటివ్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆ సర్వే ఫలితాలను మాకు చెప్పారన్నారు. అధిష్టానం ఆదేశాలతోనే కుంభం అనిల్‌తో మాట్లాడామని.. మనస్పూర్తిగా అనిల్‌ను పార్టీలోకి తిరిగి స్వాగతిస్తున్నామన్నారు రేవంత్. అనిల్‌కు సముచిత స్థానాన్ని కాంగ్రెస్‌లో కల్పిస్తామని.. ఇక తాను కూడా నిశ్చితంగా నిద్రపోతానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

తాను సున్నిత మనస్కుడినని కుంభం అనిల్‌ తెలియజేశారు. ఏదో బాధతో నెల రోజులు ఇబ్బంది పడ్డానని.. ఆవేశంలో ఓ నిర్ణయం తీసుకుని పక్కకు వెళ్లానని తెలిపారు. రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానని..కార్యకర్తలు తనను బాగా కాపాడుకున్నారని అనిల్‌ పేర్కొ్న్నారు. కేసీ వేణుగోపాల్‌ కూడా తనకు ఫోన్‌ చేసి మాట్లాడారని. త్వరలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలుస్తానని అనిల్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు

Advertisment
తాజా కథనాలు