Sitaram Yechury: ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి: సీతారాం ఏచూరి

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాంగ్రెస్‌ కూటమి ఓట్లను చీల్చడం ద్వారా కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని చెప్పారు.

Sitaram Yechury: ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి: సీతారాం ఏచూరి
New Update

Sitaram Yechury: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని అన్నారు. సీట్ల విషయంలో అతి స్వల్పంగా మెరుగుపడినా తీవ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. లెఫ్ట్‌ తరఫున ఎన్నో ఆందోళనలను నిర్వహించినా ఎన్నికల్లో ఆ ప్రభావం చూపకపోవడం నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: అధికారంలో యువరక్తం.. పవన్, లోకేష్ తో పాటు పవర్ ఫుల్ టీమ్ ఇదే..

తమకు కంచుకోటగా ఉన్న కేరళలో లెఫ్ట్‌ ఓట్లు తగ్గలేదని అన్నారు. కాంగ్రెస్‌ కూటమి ఓట్లను చీల్చడం ద్వారా కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని తెలిపారు. 17వ లోక్‌సభలో తమకు 5 సీట్లు మాత్రమే ఉండేవని.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 5 నుంచి 8కి పెంచుకున్నామని అన్నారు. అయినా సరే సంతృప్తిగా లేమని హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ప్రజల జీవన ప్రమాణాలు, నీట్‌ వంటి వాటిపై ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్లమెంటు లోపలా, బయటా వాటిపై ఆందోళనలు చేస్తామని వెల్లడించారు. బీజేపీ విభజనవాదం విఫలమైందని, హిందుత్వ కూడా ఫలితాలివ్వలేదని, అందుకు అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో ఆ పార్టీ ఓడిపోవడమే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

#sitaram-yechury
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe