/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/EVM-Safety-jpg.webp)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎక్కడ చూసినా..విన్నా ప్రస్తుతం ఇదే చర్చ జోరుగా సాగుతోంది. మరికొన్ని గంటల్లోనే ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. కౌంటింగ్ కోసం 40 కేంద్ర కంపెనీ బలగాలు మూడంచెల భద్రతతో స్ట్రాంగ్ రూమ్ లను కాపలా కాస్తున్నాయి.
కాగా ఆరు నియోజకవర్గాల్లో ఫలితాలు ఆలస్యం కానున్నాయి:
-ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లేట్ రిజల్ట్
-శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్..
-మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్‌లో రిజల్ట్ లేట్
-మెజారిటీ నియోజకవర్గాల్లో 14 టేబుల్స్
-ఈ 6 స్థానాల్లో 28 టేబుల్స్
-మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే డబుల్ టేబుల్లు
-రౌండ్ల వారిగా చూస్తే.. అత్యధికంగా కరీంనగర్, ఇబ్రహీంపట్నం..
-యాకుత్‌పుర నియోజకవర్గాల్లో 25రౌండ్ల చొప్పున కౌంటింగ్
-అతి తక్కువగా భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14,
-చార్మినార్‌లో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
అసలు ఓట్ల లెక్కింపు ప్రాసెస్ ఎలా ఉంటుంది. అధికారులు ముందుగా ఏం చేస్తారు అనేది మీకు డీటైల్డ్‌గా తెలుసుకుందాం. ముందుగా పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. బ్యాలెట్ ఓట్లు పూర్తయిన తర్వాత.. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరిచి కంట్రోల్ యూనిట్లను టేబుల్‌కు ఒకటి చొప్పున బయటకి తీసుకొస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని "టోటల్" బటన్‌ను నొక్కగానే ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: పోస్టల్ బ్యాలెట్లు ఇలా.. ఈవీఎంలు అలా… కౌంటింగ్ ప్రాసెస్ ఇదే!