Ethanol Production: ఇథనాల్ కోసం చెరకు రసం ఉపయోగించడంపై నిషేధం చెరకురసం నుంచి ఇథనాల్ తయారు చేయడంపై కేంద్రం నిషేధాన్ని విధించింది. పంచదార ధరలను అదుపులో ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఇథనాల్ సప్లై ఇయర్ అంతా ఈ నిషేధం అమలులో ఉంటుంది. By KVD Varma 08 Dec 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ethanol Production: ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకు రసాన్ని ఉపయోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇథనాల్ సరఫరా సంవత్సరం (ESY) 2023-24 కోసం ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం గురించి అక్టోబర్ 7 గురువారం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా సమాచారం ఇచ్చింది. చక్కెర ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మిల్లుల్లో బ్లెండింగ్ అవసరాలు, ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల (OMC) ప్రస్తుత ఆర్డర్ల మేరకు బీ-హెవీ మొలాసిస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి కొనసాగుతుందని షుగర్ మిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవోకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023-24 పంట సీజనుకు ప్రభుత్వం చెరకు ధరను క్వింటాలుకు రూ.10 పెంచి రూ.315గా చేసింది. ఇది చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర ఎఫ్ ఆర్ పీ. ప్రస్తుత 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులు చెరకు రైతుల నుంచి రూ .1.11 లక్షల కోట్లకు పైగా విలువైన 3,353 లక్షల టన్నులను కొనుగోలు చేశాయి. పదేళ్ల క్రితం 2013-14 మార్కెటింగ్ సంవత్సరంలో మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకును కొనుగోలు చేశాయి. తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయి.. Ethanol Production: అంతర్జాతీయంగా చక్కెర ధరలు రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ దేశంలో చక్కెర రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయని ప్రభుత్వం అక్టోబర్ లో తెలిపింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ లో ప్రస్తుత అవసరాలకు, రాబోయే పండుగల సీజన్ కు చక్కెర నిల్వలకు కొదవలేదు. 2023 ఆగస్టులో 83 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. 2023 అక్టోబర్ లో క్రషింగ్ తర్వాత చక్కెర నిల్వలు మెరుగ్గా ఉన్నాయి. దీంతోపాటు దేశీయ అమ్మకాల కోటా మొదటి విడతను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. చక్కెర మిల్లులు ఇప్పుడే విక్రయించడం ప్రారంభించవచ్చు. ఇందుకోసం కోటాను మరింత పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో సూచన.. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, సోమవారం జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఈ విషయంపై(Ethanol Production) చర్చ జరిగింది. దీనికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. Also Read: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తీసేశారు.. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్ర, కర్నాటకలో చక్కెర ఉత్పత్తి మరింత ఖరీదు చేసే అవకాశం ఉందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేలోపు దేశంలో సరిపడా చక్కెర అందుబాటులో ఉండాలని మంత్రులు సూచించారు. చెరకు రసం, బి-హెవీ మొలాసిస్‌తో తయారు చేసిన ఇథనాల్‌ను కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లేఖ రాయాలని సీనియర్ మంత్రులు క్యాబినెట్ సెక్రటరీని కోరింది. భారతీయ ఇంధన రిటైలర్లు గ్యాసోలిన్‌లో చేర్చడానికి చక్కెర మిల్లుల నుంచి ఇథనాల్‌ను(Ethanol Production) సేకరిస్తారు. చెరకు రసం - B-హెవీ మొలాసిస్ నుంచి తీసుకున్న ఇథనాల్ కోసం వారు గతంలో అధిక ధరను భరించేవారు. Watch this interesting Video: #sugar-cane-juice #ethanol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి