Kakinada: కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు, దెయ్యం వదంతుల పై RTV వరుస కథనాలకు స్పందన లభించింది. దెయ్యం కోసం రాత్రి నుంచి తెల్లవారు జామువరకు గ్రామంలో ఒంటరిగా తిరిగారు ఆర్టీవీ బృందం. గత రాత్రంతా గ్రామంలో తిరిగినా వింత మనుషులు, దెయ్యం అనవాళ్ళు కనిపించలేదని తెలుస్తోంది. దీనిపై స్పందించిన జనవిజ్ఞాన వేదిక సంఘాలు, పోలీస్ అధికారులు గ్రామంలో రాత్రి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీసులతో కలిసి కాండ్రకోట వీధుల్లో తిరిగి గ్రామస్తులలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు RTV బృందం.
Also Read: నటి జయప్రద అరెస్ట్..? కారణం ఇదే..!
దెయ్యాలు, మంత్రులు వంటివి నమ్మవద్దని, మ్యాజిక్ ట్రిక్స్ ద్వారా చేసి చూపించారు జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు. చంద్రమండలంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకునే వరకు మానవాళి విజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలితే.. అదే మంత్రాలతో ఎంత డబ్బు అయినా సంపాదించవచ్చని అన్నారు. ఇంకా దెయ్యాలు, భూతాలు అంటూ అవిజ్ఞానాన్ని వీడాలని గ్రామ ప్రజలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Also Read: ‘యానిమల్’ నాకు బాగా నచ్చింది.. చూసినంతసేపు అదే ఫీలింగ్ కలిగింది!
పెద్దాపురం పోలీసులు కూడు గ్రామంలో గస్తీ ముమ్మరం చేసి ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి..తప్పుడు వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. గుప్తనిధుల పేరుతో కూడా ఇటువంటి చర్యలకు కొందరు పాల్పడే అవకాశం ఉందంటున్నారు. గతంలో రాజుల పురాతన కోటలు ఉండే ప్రాంతంలో నిధులు ఉంటాయని ఆశతో ఇటువంటి వదంతులు ప్రచారం చేస్తారని తెలిపారు. మరోపక్క సారా వ్యాపారుల కార్యకలాపాల కోసం కూడా ఈ విధంగా పక్కదారి పట్టించే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అటువంటి వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని, ఇటువంటి వారిపై చర్యలు తప్పవని పెద్దాపురం సీఐ రవికుమార్ వార్నింగ్ ఇచ్చారు.