Artificial Intelligence: యుగాంతం..! ఇక కొన్ని రోజులే.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

యుగాంతానికి టైమొచ్చిందా..? మనుషులను భయపెడుతున్న AI మానవజాతి అంతానికి టెక్నాలజీ కారణం కానుందా..? అమెరికా సునామీలు, ప్రళయాల కంటే ఏఐ డేంజరా..? అసలు పరిశోధకులు ఏం చెబుతున్నారో తెలియాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Artificial Intelligence: యుగాంతం..! ఇక కొన్ని రోజులే.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

Artificial Intelligence:  యుగాంతం అంటే మనకు మొదట గుర్తొచ్చేది భూకంపాలు, సునామీలు, ప్రళయాలు. నిజానికి సినిమాల్లోనూ ఇవే అంశాలను చూపిస్తారు. ఏదో పెద్ద ప్రళయం వచ్చి భూమి నాశనమవుతుందని.. అందులో మనుషులు కూడా చనిపోతారని చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రకృతి వైపరీతాల్యతో కాకుండా.. మానవుని అంతానికి టెక్నాలజీనే కారణమవుతుందంటే నమ్మగలరా..? ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌.. మనం ముద్దుగా ఏఐ అని పిలుచుకుంటాం.

publive-image

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాటే వినిపిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత మారిపోయిన ప్రపంచ రూపురేఖల మధ్యలో ఇప్పుడు ఏఐ మరింత వేగంగా అన్ని రంగాల్లోనూ మార్పులను తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. మనం చూస్తున్న సినిమాల్లో గ్రాఫిక్స్‌.. చదువుతున్న పేపర్లలో రాతలు.. మన అకౌంట్స్‌ వెరిఫికేషన్‌.. ఆరోగ్య రేఖలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతిచోటా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. ఆఖరుకు ఏఐ యాంకర్లు కూడా వచ్చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ మన జీవితంలో ఏఐ భాగమైపోతుండగా.. అమెరికా పరిశోధకులు మరో బాంబు పేల్చారు.

publive-image

ఏఐతో మానవజాతి అంతం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్‌ 2022లో చాట్‌ జీపీటీ ప్రయోగానికి ఇంకా ఒక నెల సమయం ఉండగానే యూఎస్‌ ప్రభుత్వం గ్లాడ్‌ స్టోన్‌ ఏఐని సిద్ధం చేసింది. ఆయుధాలకు అమర్చిన ఏఐ ద్వారా ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశముందా అని చెప్పడమే దీని పని. భద్రతా వ్యవస్థకు వచ్చే బెదిరింపులు ఏంటనేది విశ్లేషించడం గ్లాడ్‌ స్టోన్‌ ఏఐ ఉద్దేశం. ఏడాది తర్వాత గ్లాడ్‌ స్టోన్‌ ఏఐ తన విశ్లేషణ పూర్తిచేసి ఒక రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఒక లైన్‌ ఇప్పుడు మనుషులను భయపెడుతోంది. ఏఐ మానవజాతి అంతరించిపోయే ముప్పు తీసుకురావచ్చన్నదే ఆ లైన్‌. ఏఐతో వచ్చే ముప్పు గురించి జరిపిన పరిశోధనల్లో చాలా స్పష్టంగా మనుషులను అంతరించేలా చేసేస్తాయో ప్రమాదం తీసుకురావచ్చన్నది తెలుస్తోంది.

 Also Read: Family Star: రియల్ ‘ఫ్యామిలీ స్టార్’ ఇంటికి.. ఫ్యామిలీ స్టార్ టీమ్ .. వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు