ప్రిన్స్ మహేశ్ సినిమాను రిజెక్ట్ చేశా: రేణుదేశాయ్

మహేశ్ బాబు సినిమాను వదులుకున్నా ఎందుకో కారణం చెప్పలేను..కామ్‌గా ఉండటమే బెటర్ అంటూ నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చిందన్న రేణుదేశాయ్..కొన్ని రిజన్స్ వల్ల నటించలేకపోయాని చెప్పారు. అయితే, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణం చెప్పలేకపోతున్నట్లు రేణుదేశాయ్ తెలిపింది.

ప్రిన్స్ మహేశ్ సినిమాను రిజెక్ట్ చేశా: రేణుదేశాయ్
New Update

Renu Desai About Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా  వదులుకుంటురా..? కానీ, నటి రేణుదేశాయ్(Renu Desai) మాత్రం మహేశ్  సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఎందుకు మహేశ్ బాబు తో సినిమాని రిజక్ట్ చేసింది అని ప్రిన్స్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా ఆఫర్ వదులుకోవడంపై ఆమె స్పందించారు.

Also Read: నేషనల్ స్టార్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది ఇతనే..!!

తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో చేయలేకపోయానని నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సర్కారువారి పాట(Sarkari Vari Pata) సినిమాలో తనకు అవకాశం వచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని కొన్ని రిజన్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణాలను చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు.

publive-image

ఈ సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు రేణుదేశాయ్. ఆ సినిమాలో నటించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని తెలిపారు.అయితే, అందుకు  కారణాలను మాత్రం రేణుదేశాయ్ వెల్లడించలేదు. ఎందుకంటే అనవసరంగా కాంట్రావర్సీ అవుతుందన్నారు. నిజం ఏమిటో చెప్పాలని ఉందని, కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అని చెప్పారు.

#mahesh-movie #actress-renu-desai
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe