Renu Desai: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిత్వం గురించి ఆయన మాజీ సతీమణి రేణూదేశాయ్(Renu Desai) కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజు నుంచి రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేస్తూనే ఉన్నానని తెలిపారు. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని.. పవన్ ఓ అరుదైన వ్యక్తి అన్నారు. ఆయన డబ్బు మనిషి కాదని.. సమాజం, పేదవాళ్ల కోసం ఏదైనా చేయాలని పరితపించే వ్యక్తి అంటూ ఆమె కొనియాడారు. ఇటీవల జరిగిన పలు అంశాలపై ఆమె మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
రాజకీయాల్లో ఆయన చేస్తున్న సేవను గుర్తించండని సూచించారు. మంచి నటుడు స్టార్ హీరోగా ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. దయచేసిన పవన్‌కు ఒక అవకాశం ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండని చురకులు అంటించారు. ఇకనైనా పవన్ మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపండన్నారు. తన పిల్లలనే మిగిలిని ఇద్దరు పిల్లలను ఈ వివాదాల్లోకి లాగకండని కోరారు.
అలాగే బ్రో సినిమాలో నెలకొన్న శ్యాంబాబు వివాదంపైనా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసిందన్నారు. ఆ వివాదం గురించి తనకు అవగాహన లేదని.. కాకపోతే పవన్ పెళ్లిళ్లపై సినిమా తీస్తామని, వెబ్ సిరీస్ చేస్తామని కొందరు అన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఓ తల్లిగా అభ్యర్థిస్తున్ఆన పరిస్థితుల ఏమైనా సరే దయచేసి పిల్లలను ఇందులోకి లాగకండి అంటూ రేణూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థ్యాంక్స్ వదిన మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుందని పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ఇక రేణూ దేశాయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు' అనే పాన్ ఇండియా మూవీలో కీలకపాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలకానుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ లోనూ ఆమె నటించారు.