AP News: దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్‌ రోడ్డు... పరిశీలించిన మంత్రి!

విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును పరిశీలించారు. నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మరమ్మతులకు సంబంధించి అధికారులతో చర్చించారు.

New Update
AP News: దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్‌ రోడ్డు... పరిశీలించిన మంత్రి!

AP News: విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు దెబ్బనడంతో విషయం తెలుసుకున్న ఆనం నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాలను రద్దు చేసుకుని విజయవాడకు వచ్చారు. ఘాట్ రోడ్‌లో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలిచారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి వెంటనే చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి ఆనం మాట్లాడారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎండోమెంట్‌ కమిషనర్‌ సత్యనారాయణ, దేవాదాయశాఖ అధికారులు మంత్రి వెంట ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నదున ప్రజలు ఎవ్వరు బయటకు రావద్దని ఆనం విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

Also Read : సమంతకు మద్దతుగా అనుష్క శెట్టి.. టాలీవుడ్‌లోకి హేమ కమిటీ ఎంట్రీ!?

Advertisment
Advertisment
తాజా కథనాలు