AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..! ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరిన వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. By Jyoshna Sappogula 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP EX MLA Vallabhaneni Vamsi: ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులకు ఆదేశించింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. Also Read: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్..! ఈ కేసులో ఇప్పటికే 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 71వ ముద్దాయిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగానే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే, వంశీ ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులు అతడిని అరెస్ట్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. #vallabhaneni-vamsi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి