Minister Srinivas Goud: అంతిమంగా ధర్మం గెలిచింది: శ్రీనివాస్ గౌడ్
కొంతమంది నాయకుల కుట్ర ఎన్నికల అఫిడవిట్ కేసు అని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపధ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీవీ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. అంతిమంగా ధర్మం గెలిచిందని అన్నారు. నేను చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేకే నాపై కేసులు వేయించారని విమర్శించారు.
Minister Srinivas Goud: కొంతమంది నాయకుల కుట్ర ఎన్నికల అఫిడవిట్ కేసు అని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud). ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపధ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీవీ (RTV) తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. అంతిమంగా ధర్మం గెలిచిందని అన్నారు. నేను చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేకే నాపై కేసులు వేయించారని విమర్శించారు. నాడు దశాబ్దాల కాలం పదవుల్లో ఉండి పుట్టిన గడ్డకు ఏమి చేయలేని వారు, నేను చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేకే నాపై కేసులు వేయించారని ఆరోపించారు. ప్రతిపక్షాల నేతలు.. కేసులతో నాపై పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గొప్ప గొప్ప నాయకులు సాధించని మెజారిటీ 2018 ఎన్నికల్లో నాకు వచ్చింది.. వచ్చే ఎన్నికల్లో నా రికార్డును నేనే బద్దలు కొడతాను అంటూ ధీమ వ్యక్తం చేశారు.ప్రజలు నాకు అండగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2014 తర్వాత చాలా మహబూబ్ నగర్ చాలా అభివృద్ది చెందిందని, మరోసారి గెలిస్తే హైదరాబాద్ కు ధీటుగా మహబూబ్ నగర్ ను మారుస్తా అని ప్కేరొన్నారు. తాను చేస్తున్న పనులకు ప్రజల నుండి వచ్చే స్పందనే తనకు ఎనర్జీని ఇస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పును అందిస్తారని అంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆర్టీవీ తో ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి..