/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Reliance-Industries.png)
Reliance Bonds: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధులను సమకూర్చుకోవడానికి ప్రత్యేక పథకం వేసింది. దాదాపు 15 వేల కోట్ల రూపాయలను లోకల్ కరెన్సీ బండ్ల ద్వారా సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రణాళిక కనుక పూర్తి అయితే, ఇది కంపెనీకి దేశంలో అతి పెద్ద బాండ్ల విక్రయం అవుతుంది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. 2020 తర్వాత దేశీయ బాండ్ మార్కెట్లో రిలయన్స్ గ్రూప్(Reliance Group) బాండ్ల విక్రయాలు చేయడం ఇదే తొలిసారి.
వినియోగదారుల వ్యాపారాన్ని విస్తరించడానికి ఇటీవల రిలయన్స్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కేకేఆర్ అండ్ కో వంటి రిటైల్ ఇన్వెస్టర్లను రంగంలోకి దింపింది. ఈ కారణంగా, కంపెనీ స్థానిక బాండ్ల ద్వారా నిధులను సమీకరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
లోకల్ కరెన్సీ బాండ్ అంటే ఏమిటి?
స్థానిక కరెన్సీ బాండ్లను దేశీయ కరెన్సీ బాండ్లు(Local Currency Bonds) అని కూడా అంటారు. ఇవి డెట్ సెక్యూరిటీ బాండ్లు, వీటిని స్థానిక కరెన్సీలో మాత్రమే మార్పిడి చేసుకోవచ్చు. అంటే వీటిని ఈ బాండ్లను జారీ చేసే దేశ కరెన్సీగా మార్చుకోవచ్చు.
ఇందులో బాండ్లను కొనుగోలు చేసేవారు కంపెనీ క్రెడిట్ రిస్క్, వడ్డీ రేటులో మార్పులను అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం, కార్పొరేట్లు, ఇతర సంస్థలు నిధుల సమీకరణ కోసం స్థానిక బాండ్లను జారీ చేస్తాయి.
ఇవి విదేశీ కరెన్సీ బాండ్లకు భిన్నంగా ఉంటాయి. విదేశీ కరెన్సీలో జారీ చేసిన బాండ్ విలువ ఆ దేశ కరెన్సీలో ఉంటుంది. దాని వడ్డీ కూడా అదే దేశ కరెన్సీ ప్రకారం లెక్కిస్తారు.
సాధారణంగా కంపెనీలకు ఫండ్స్ అవసరం అయినపుడు వివిధ పద్ధతుల్లో దానిని సమకూర్చుకుంటాయి. వాటిలో ఈ లోకల్ కరెన్సీ బాండ్స్ ఒకటి. ఇది మాత్రమే కాకుండా మరో రెండు విధానాల్లో కూడా కంపెనీలు ఫండ్స్ సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అవేమిటంటే..
స్టాక్ మార్కెట్- Stock Market: కంపెనీ షేర్ల ద్వారా స్టాక్ మార్కెట్ నుంచి నిధులను సమీకరించవచ్చు. అయితే ఇందుకోసం కంపెనీలో షేర్ హోల్డర్స్ కు వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది.
బ్యాంక్ లోన్- Bank Loans: కంపెనీ, ప్రభుత్వం, ఇతర సంస్థలు కూడా బ్యాంకు నుంచి లోన్స్ తీసుకుని నిధులు సమీకరించుకోవచ్చు. అధిక వడ్డీల భారం వలన చాలాసార్లు కంపెనీలు ఈ ఆప్షన్ ను చాలావరకూ పరిగణనలోకి తీసుకోవు.