/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Konda-Vishweshwar-reddy-jpg.webp)
చేవెళ్ల ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు. మోదీ సర్కార్ ముస్లింలను ఆదుకుంటే.. ఇతర పార్టీలు వాడుకుంటారన్నారు. రేవంత్ రెడ్డి మక్కల కుంభకోణం, గుడ్ల స్కాం చేసి పైకొచ్చాడని ధ్వజమెత్తారు. రంజిత్ అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ ఆరోపణలు అవాస్తవమైతే తనపై ఎందుకు పరువు నష్టం దావా ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డిని ఎవరూ గుర్తు పట్టరన్నారు. బీజేపీలో గ్రూపు తగాదాలు లేవన్నారు.
బీజేపీ నేత లక్ష్మణ్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కేసీఆర్ ను దించాలన్న లక్ష్యంతో రేవంత్ ను పీసీసీ చీఫ్ గా చేయాలని తాను లాబీయింగ్ చేసిన మాట వాస్తమేనన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు తానను కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారన్నారు. రేవంత్ రెడ్డి నుంచి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలే గాడిద గుడ్లు అని విమర్శించారు. రంజిత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు జనవరి నుంచి ప్రయత్నాలు చేశాడన్నారు. కానీ ఆయనను చేర్చుకోలేదన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.