Diseases Obesity: ఊబకాయం అనేది మీ ఫిట్‌నెస్, రూపాన్ని పాడుచేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఊబకాయం కూడా తీవ్రమైన వ్యాధిగా చెబుతున్నారు. దీని కారణంగా.. అనేక ప్రమాదకరమైన వ్యాధులు కూడా సంభవించవచ్చు. ఒక నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన 44 లక్షల మంది మహిళలు, 26 లక్షల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం బారిన పడుతున్న 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు దాదాపు 12.5 లక్షల మంది ఉన్నారు. ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణం సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయంకి ప్రమాదాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఊబకాయం బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా ఎలా గుర్తించబడుతుంది? BMI 30 కంటే ఎక్కువ ఉన్నవారిని ఊబకాయంగా పరిగణిస్తారు. ఆహారాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా స్థూలకాయాన్ని నయం చేయవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలో నివేదించబడిన అన్ని వ్యాధులలో 56.4 శాతం కేవలం ఆహారం కారణంగానే సంభవిస్తున్నాయి. సమతుల్య ఆహారం, వ్యాయామం ద్వారా దీనిని నివారించవచ్చు. దీంతో గుండె జబ్బులు, అధిక రక్తపోటు మాత్రమే కాకుండా టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా 80% తగ్గించుకోవచ్చు.
ఊబకాయం- ఆహారం మధ్య సంబంధం:
- అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు.. చాలా కేలరీలు శరీరంలోకి చేరుతాయి. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతుంది. అధిక కొవ్వు పేగు మైక్రోబయోమ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ఊబకాయం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది. కొవ్వు వల్ల మధుమేహం, పక్షవాతం, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నివారణ మార్గాలు:
- ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండం వల్ల జీవనశైలి మెరుగుపడుతుంది.
- సంతృప్త, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు పుష్కలంగా తినాలి.
- తీపి పానీయాలు, అనారోగ్యకరమైన కొవ్వులు మానుకోవాలి.
- తగినంత నిద్ర తీసుకోవటం ఉత్తమం.
- అధిక బరువు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని సర్జరీలతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఎండ నుంచి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయాలా? చేయకూడదా?