Nature Benefits: ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి, బిజీ లైఫ్, అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, టెన్షన్ వంటి కారణాల వల్ల చాలా మంది డిప్రెషన్, యాంగ్జయిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ మానసిక స్థితి ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుడంతోపాటు అనేక తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాంటి సమయంలో నిరాశను నివారించడానికి.. యాంటీ-డిప్రెసెంట్ మందులు తీసుకుంటారు, ఖరీదైన చికిత్స, మానసిక వైద్యుల వద్దకు వెళ్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని సహజమైన పనిని చేస్తే..పూర్తిగా డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు, మీ మూడ్‌ను తాజాగా చేసుకోవచ్చ అంటున్నారు. అలాంటి చిట్కాల గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిప్రెషన్, ఆందోళన తగ్గించే చిట్కాలు:
- డిప్రెషన్, యాంగ్జయిటీతో బాధపడుతూ సహజమైన రీతిలో తగ్గించుకోవాలనుకుంటే.. దీని కోసం ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. నిపుణులు కూడా ప్రకృతిలో, పచ్చదనంలో గడపడం మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది హృదయ సంబంధ వ్యాధులు, గుండె ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
- గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల మీకు సానుకూల శక్తి వస్తుంది. నిజానికి, క్లే యాంటీ-డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. దీని తీపి సువాసన న్యూరోట్రాన్స్‌మిటర్‌ను సక్రియం చేస్తుంది. సెరోటోనిన్‌ను విడుదల చేస్తుంది. దాని వల్ల మనం సంతోషంగా ఉంటామని నిపుణుల అభిప్రాయాలు తెలుపుతున్నారు.
- ఓ పరిశోధన ప్రకారం ఇంటి చుట్టూ 100 మీటర్ల వరకు చెట్లు, పచ్చదనం ఉన్నవారు సాధారణ ప్రజల కంటే తక్కువ యాంటీ డిప్రెసెంట్ మందులు తీసుకుంటారు.
- డిప్రెషన్, ఆందోళనను తగ్గించుకోవాలనుకుంటే.. ప్రతిరోజూ ఉదయం 2 నుంచి 5 నిమిషాలు గార్డెన్, పార్క్‌కి వెళ్లి పచ్చదనాన్ని జాగ్రత్తగా చూడాలి. ఇది కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. మనస్సును రిఫ్రెష్ చేసి డిప్రెషన్ నుంచి ఉపశమనం అందిస్తుంది. ఈ థెరపీని గ్రీన్, బ్లూ ప్రిస్క్రిప్షన్ అని కూడా అంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పర్యావరణానికి తగ్గట్టుగా వంటగదిని ఇలా తయారుచేసుకోండి..! టేస్ట్ కూడా అదిరిపోద్ది!