Kadapa: ఎర్రచందనం అక్రమ రవాణా తరలింపుపై అధికారులు హైఅలర్ట్ అయ్యారు. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తాజాగా, కడప జిల్లా బి.మఠం మండలం బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారుల తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: హమ్మయ్య.. ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..!
ఒకరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు అటవీ అధికారులు. పరారీలో ఉన్న మరికొందరు స్మగ్లర్లపై అధికారులు గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే, ఎర్రచందనం తరలింపులో ఓ కానిస్టేబుల్ పాత్రపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. బద్వేలు పి.ఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు.