NIACL Admit Card 2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. నమోదు చేసుకున్న అభ్యర్థులతో పాటు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ newindia.co.in ని విజిట్ చేసి అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తారు.
పరీక్షకు సిద్ధంకండి:
టైర్-1 ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్) మార్చి 2న నిర్వహిస్తారు. పరీక్ష 60 నిమిషాల పాటు జరుగుతుంది.
టైర్-2 ఆన్లైన్ పరీక్ష (మెయిన్ పరీక్ష) ఏప్రిల్ 13న నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కు ఉంటుంది.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి దశలు:
--> అధికారిక వెబ్సైట్ www.newindia.co.in ని విజిట్ చేయండి.
--> హోమ్‌పేజీలో 'రిక్రూట్మెంట్-అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్'పై క్లిక్ చేయండి.
--> అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
--> మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించండి.
--> అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
--> ఫ్యూచర్ పర్పెస్ కోసం అడ్మిట్ కార్డ్‌ను ప్రింటవుట్ తీసుకోండి.
Also Read: టీజీటీ, జేఎల్, డీల్ రిజల్ట్స్ రిలీజ్!
WATCH: