43 ఏళ్ల టెస్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన బెన్ స్టోక్స్!

వెస్టిండీస్‌తో జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ఇయాన్ బోథమ్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెన్ స్టోక్స్ చోటు దక్కించుకున్నాడు.

43 ఏళ్ల టెస్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన బెన్ స్టోక్స్!
New Update

వెస్టిండీస్‌తో జరుగిన 3వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించి 43 ఏళ్ల ఇంగ్లండ్ లెజెండ్ ఇయాన్ బోథమ్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెన్ స్టోక్స్ చోటు దక్కించుకున్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ కేవలం 175 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 82 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌-బెన్‌ డకెట్‌ వికెట్ కోల్పొకుండా టార్గెట్ ను పూర్తిచేశారు. తొలి ఓవర్ లోనే దూకుడుగా బ్యాటింగ్ చేసిన బెన్ స్టోక్స్  24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లండ్ ను విజయతీరాలకు చేర్చాడు.

దీని ద్వారా ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఇంగ్లండ్ లెజెండ్ ఇయాన్ బోథమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు ఇయాన్‌ బోథమ్‌ 1981లో భారత్‌పై 28 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. దీన్ని బెన్ స్టోక్స్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ దిగ్గజం మిస్బా ఉల్ హక్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో అర్ధశతకం సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 23 బంతుల్లో అర్ధ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే బెన్ స్టోక్స్,  కల్లిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీలతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు.

#west-indies #ben-stokes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe