New Year 2023: న్యూ ఇయర్ అని తెగ తిన్నారు.. నిమిషానికి 1,244 బిర్యానీలు, 6.2 లక్షల ఓయో బుకింగ్స్! నిమిషానికి 1244 బిర్యానీలు, గంటకు 1772 కండోమ్ల, ఒక్క రోజులో 6.2లక్షల ఓయో బుకింగ్స్.. ఇలా న్యూఇయర్ పలు రికార్డులు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా బిర్యానీ, కండోమ్‌ల ఆర్డర్‌తో పాటు ఓయో బుకింగ్స్ రికార్డయ్యాయి. అన్‌లైన్ డెలవరీ ఫ్లాట్‌ఫారమ్స్‌కు న్యూఇయర్ కాసులు కురిపించింది. By Trinath 02 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి న్యూఇయరా.. యుగాంతం చివరి రోజా? ఆ ఓయో(OYO) బుకింగ్స్ ఏంటి.. ఆ బిర్యానీ(Biryani) ఆర్డర్లు ఏంటి.. మధ్యలో కండోమ్ల(Condoms) కనుగోలు ఏంటి? న్యూఇయర్(New Year)కు సంబంధించి డేటా చూస్తున్న సామాన్యుల ప్రశ్నలివి. ఎంజాయ్‌మెంట్‌కు ఇదే చివరి రోజు అన్నట్టు సాగింది కొందరి తీరు. ఆడిపాడారు.. తాగి తూలారు.. బెడ్‌ఎక్కారు.. ఇంక ఎవరికి నచ్చింది వాళ్లు..! మొత్తానికి న్యూఇయర్ అన్‌లైన్ డెలవరీ ఫ్లాట్‌ఫారమ్స్‌కు కాసులు కురిపించింది. జొమాటోలో అయితే 2015-2020 మధ్య ఎన్ని ఆర్డర్లు వచ్చాయో డిసెంబర్ 31(2023)న అన్ని ఆర్డర్లు వచ్చాయి. ఇటు హైదరాబాద్‌లో బిర్యానీ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణ రోజుల్లోనే అన్నం తిన్నట్టు బిర్యానీ తింటుంటారు. న్యూఇయర్ డేన(జనవరి 1) ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా రూ.4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లను డెలవరీ చేసింది స్విగ్గీ. అంటే ప్రతీ నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయి. చివరి గంటలో దాదాపు 10 లక్షల మంది స్విగ్గీ యాప్ యూజ్ చేశారంటే ప్రజలు ఎలా తిన్నారో అర్థం చేసుకోవచ్చు. రికార్డు బ్రేక్: కొత్త సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ రోజున స్విగ్గీ ఆర్డర్ రికార్డును అధిగమించింది. డిసెంబర్ 19(2023)న జరిగిన ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. 350,000 బిర్యానీ ఆర్డర్‌లను ఫైనల్ మ్యాచ్ అప్పుడు డెలవరీ చేసింది స్విగ్గీ. ఇప్పుడు ఏకంగా 4.8లక్షల ఆర్డర్లన నూతన సంవత్సర పండుగ సందర్భంగా కస్టమర్ల ఇంటికు డెలివరీ చేసింది. రెండున్నర లక్షల పిజ్జా ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ, 2024 నూతన సంవత్సర పండుగ స్విగ్గీ ఫుడ్, స్విగ్గీ ఇన్‌స్టాగ్రామ్‌లోని అన్ని రికార్డులను బద్దలు కొట్టిందన్నారు. THEY SAID YES 💍💍💍 to biryani pic.twitter.com/ikwAwF8dFA — Swiggy (@Swiggy) December 31, 2023 హోటల్ బుకింగ్స్: హోటల్ బుకింగ్‌లలో న్యూఇయర్ రికార్డులు సృష్టించింది. డిసెంబర్31-జనవర్ 1న ఓయో(OYO) రూమ్‌ల బుకింగ్‌లు 37 శాతం పెరిగి 6.2 లక్షలకు చేరుకున్నాయి. ఇంకా, డిసెంబర్ 30-31 మధ్య చివరి నిమిషంలో 2.3 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయి. అయితే ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. తీర్థయాత్ర స్థలాలను ఎక్కువగా ప్రజలు బుక్ చేసుకున్నారు. అయోధ్యలో బుకింగ్స్‌లో 70 శాతంగా ఉంటే గోవాలో 50 శాతం, నైనిటాల్‌లో 60 శాతం బుకింగ్స్ పెరిగాయి. ఇక 2023 చివరి రోజు(డిసెంబర్ 31) కండోమ్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. గంటకు 1,772 కండోమ్లను ప్రజలు ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. అటు డెవవరీ యాప్ బ్లింకిట్ నివేదిక ప్రకారం ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి గతేడాది 9,940 కండోమ్‌లు ఆర్డర్ చేశాడు. Also Read: కండోమ్ ఆర్డర్ల జాతర.. న్యూఇయర్‌కి రికార్డ్ సేల్స్.. ఎంతో తెలిస్తే షాక్! WATCH: #biryani #oyo #new-year-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి