Smoothies: టేస్టీ అండ్ హెల్తీ స్మూతీస్.. ఇంట్లోనే ఈజీగా..! తప్పక ట్రై చేయండి సహజంగా వేసవిలో చల్లటి పదార్థాలు త్రాగడానికి,తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మూడు రకాల ఫ్రూట్ స్మూతీస్ ట్రై చేయండి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి. ఆరెంజ్,మ్యాంగో స్మూతీ, బనాన స్మూతీ, స్ట్రాబెర్రీ స్మూతీ. By Archana 09 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ప్రతి ఒక్కరూ వేసవిలో తేలికపాటి, చల్లటి పదార్థాలు త్రాగడానికి ఇష్టపడతారు. వేసవి రోజులలో ఏదైనా చల్లగా తాగాలనుకుంటే, ఈ 3 రకాల వంటకాలను ప్రయత్నించవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫ్రూట్ స్మూతీస్. వీటిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాము నారింజ, మామిడితో స్మూతీ కోసం కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు 1 పండిన మామిడి 1 నారింజ ½ కప్పు పెరుగు 1 టేబుల్ స్పూన్ తేనె ఐస్ క్యూబ్స్ తయారీ విధానం నారింజ, మామిడితో స్మూతీ కోసం ముందుగా మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. అలాగే నారింజ తొక్క తీసి దాని గింజలను తీయండి. ఇప్పుడు మిక్షీలో పెరుగు కొన్ని ఐస్ క్యూబ్స్‌తో, పండ్ల ముక్కలు వేసి మృదువైనంత వరకు గ్రైండ్ చేయండి. ఈ స్మూతీ పెరుగుతో క్రీమీగా మారుతుంది. వేసవిలో ఇది కడుపును చల్లగా ఉంచుతుంది. అరటిపండు, ఖర్జూరం, బాదంపప్పుల స్మూతీ కావాల్సిన పదార్థాలు 1 కప్పు పాలు 20 గ్రాముల ఖర్జూరం 10 నుంచి 12 బాదంపప్పులు ఐస్ క్యూబ్స్ తయారీ విధానం దీన్ని చేయడానికి, ఖర్జూరం, బాదంపప్పులను 1 కప్పు పాలలో 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత వీటిని అరటిపండుతో పాటు మిక్షీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలు, ఐస్ క్యూబ్స్ వేసి మరో రౌండ్ తిప్పండి. దీన్ని కొంత సమయం ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లారిన తర్వాత గ్లాసుల్లో పోసి ఐస్ క్యూబ్స్, తరిగిన బాదంపప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. స్ట్రాబెర్రీ, జీడిపప్పు స్మూతీ కావాల్సిన పదార్థాలు ½ కప్పు తరిగిన స్ట్రాబెర్రీలు 1 కప్పు పాలు 5 నుంచి 7 జీడిపప్పులు ఐస్ క్యూబ్స్ తయారీ విధానం స్ట్రాబెర్రీ, జీడిపప్పు స్మూతీ కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ తరిగిన స్ట్రాబెర్రీలను పక్కన పెట్టండి. ఆ తర్వాత వాటిని మిక్సర్ జార్లో వేసి, పాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయండి. తర్వాత గ్లాసులో పోసి పైన స్ట్రాబెర్రీ ముక్కలు, ఐస్ వేసి సర్వ్ చేసుకోండి. Also Read: Nutmeg Milk: ప్రశాంతమైన నిద్ర కోసం జాజికాయ పాలు.. ఆ సమస్యలు కూడా పరార్..? #smoothies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి