Rebal star Prabhas: సినిమాలకు దూరమైన ప్రభాస్..!! గడిచిన కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత, అతను సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ K చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలు. అంతేకాదు, లాంగ్ షెడ్యూల్స్ కూడా అవసరం. ఇలా కఠినమైన షూటింగ్ షెడ్యూల్స్ తో ప్రభాస్‌కు మోకాళ్ల సమస్య ఎక్కువైంది. By Jyoshna Sappogula 12 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి Rebal star Prabhas: గడిచిన కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత, అతను సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ K చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలు. అంతేకాదు, లాంగ్ షెడ్యూల్స్ కూడా అవసరం. ఇలా కఠినమైన షూటింగ్ షెడ్యూల్స్ తో ప్రభాస్‌కు మోకాళ్ల సమస్య ఎక్కువైంది. ఆదిపురుష్ ప్రచారం టైమ్ లోనే ప్రభాస్ వాకింగ్ స్టయిల్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఒక దశలో ఆయన కుంటుకుంటూ నడిచాడు. అయోధ్యలో ప్రమోషన్స్ టైమ్ లో హీరోయిన్ కృతి సనన్ చేయూత అందించాల్సి వచ్చింది కూడా. అప్పట్నుంచి ప్రభాస్ అలానే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్స్ చేస్తూనే ఉన్నాడు. ఇలా చాలా కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఆల్రెడీ ఇచ్చిన కమిట్‌మెంట్‌ల కారణంగా, అతను విరామం తీసుకోకుండా నిరంతరం షూటింగ్ చేశాడు. ఎట్టకేలకు అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తి చేశాడు ప్రభాస్. ఇప్పుడు షూటింగ్స్ నుంచి విరామం తీసుకున్నాడు. సలార్ షూట్ కూడా పూర్తికావడంతో, ప్రభాస్ కు టైమ్ దొరికింది. మోకాలి చికిత్స కోసం అతడు యూరోప్ వెళ్లనున్నాడు. చికిత్స అనంతరం అక్కడే కొంతకాలం విశ్రాంతి తీసుకొని, తర్వాత ఇండియాకు తిరిగొస్తాడు. తాజా సమాచారం ప్రకారం, 3 నెలల పాటు ప్రభాస్ షూటింగ్స్ కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే, మరోవైపు ఫ్యాన్స్ దృష్టి ప్రభాస్ సాలార్ రిలీజ్ డేట్ పైనే ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు వాయిదా పడింది . కొత్త విడుదల తేదీపై భారీ ఉత్కంఠ నెలకొంది కొత్త తేదీ ప్రకటించిన తర్వాత, ఆ ప్రచారానికి ప్రభాస్ అందుబాటులో ఉంటాడా ఉండడా అనే అనుమానం చాలామందిలో ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి