మీ ఒంట్లో షుగర్ లెవల్స్ తగ్గించుకోవడానికి ఈ ఒక్క కూరగాయ చాలు! మధుమేహం, టైప్ 2 మధమేహంతో బాధపడేవారు కచ్చితంగా తమ ఆహారంలో బెండకాయను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా టైమ్ కి తినాలని సూచిస్తున్నారు. By Bhavana 13 Nov 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నేడు ప్రతి పది మందిలో 7 గురు మధుమేహం, టైప్ 2 మధమేహంతో బాధపడుతున్నవారే. అలాంటి వారు తమ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల. ఈ క్రమంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా చిక్కుళ్లు, కూరగాయలు, బీన్స్, కాకరకాయ, బీరకాయ, బెండకాయ, వంకాయ వంటివి తరచూ తింటుంటారు. అయితే వీటి అన్నిటి కంటే షుగర్ పేషెంట్లకు మరో సూపర్ ఫుడ్ ఒకటి ఉంది అదే బెండకాయ. ఓ అధ్యయనం ప్రకారం..బెండకాయ రక్తంలో చక్కెను తగ్గించడంలో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కూరగాయలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఉంటాయి. ఇది వేగవంతమైన షుగర్ స్పైక్ లను నివారించడంలో బాగా సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజనం చేసిన తరువాత చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెండకాయలో క్వెర్సెటిన్, కాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిల వల్లే కలిగే నష్టాల నుంచి ఇది రక్షిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పరగడుపున బెండకాయ నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మధుమేహన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎప్పుడూ కూడా తినే భోజనంలో తప్పకుండా బెండకాయను చేర్చుకోవాలి. తక్కువ నూనె ఉపయోగించి బెండకాయను ఉడికించుకోవాలి. డయాబెటిక్ డైట్‌కి బెండకాయ ఒక విలువైనదిగా ఉంటుంది. Also read: ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..జీతం రూ.90 వేల పైనే..ఇంకెందుకు ఆలస్యం! #ladies-finger #diabaties మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి