Toilet Flush: టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్లు ఎందుకు ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా..?

టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో రెండు బటన్లు ఉండడం మీరు గమనించే ఉంటారు. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. అయితే దేన్ని నొక్కినప్పుడు ఏమి జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా..? అదేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Toilet Flush: టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్లు ఎందుకు ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా..?

Toilet Flush: ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ టాయిలెట్ యూజ్ చేయడం సహజం. వెస్ట్రన్, ఇండియన్ అనే రెండు రకాల టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్ ట్రెండ్ చాలా పెరిగింది. కొంతమందికి ఇది చాలా సౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా మోకాళ్లలో సమస్య వచ్చి కూర్చోలేని వారు దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే కమోడ్ ఫ్లష్ ట్యాంక్ నుంచి నీటిని ఫ్లష్ చేయడానికి సాధారణంగా ఒక బటన్ నొక్కుతారు. అయితే కొన్ని రకాల ఫ్లషెస్ లో రెండు బటన్స్ అందుబాటులో ఉంటాయి. ఒక పెద్ద బటన్, మరొకటి చిన్న బటన్. ఈ రెండు బటన్ల ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఫ్లష్ ట్యాంక్‌పై రెండు బటన్లు ఎందుకు ఉన్నాయి? దేన్ని నొక్కినప్పుడు ఏమి జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాము..?

ఫ్లష్ ట్యాంక్‌లో రెండు బటన్లు ఎందుకు ఉన్నాయో చాలా మందికి తెలియదు. కొంతమంది ఒకేసారి రెండు బటన్లను కూడా నొక్కేస్తారు. ఇలా చేయడం వల్ల నీరు వృథా అవుతుందా? అవును ఈ రెండు బటన్స్ నీటితో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి.

ఫ్లష్ ట్యాంక్‌ బటన్స్ 

పెద్ద బటన్‌ను నొక్కినప్పుడు, అది ఒక ఫ్లష్‌కు 6-7 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. చిన్న బటన్‌ను నొక్కితే తక్కువ నీరు వస్తుంది. చిన్న బటన్‌ను నొక్కితే 3-4 లీటర్ల నీరు ఖర్చవుతుంది. కొన్నిసార్లు నీటిని విడుదల చేసే సామర్థ్యం కూడా ఫ్లష్ ట్యాంక్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ట్యాంక్ పెద్దగా ఉంటే రెండు బటన్లలో నీరు వేర్వేరు పరిమాణంలో వస్తుంది.

publive-image

చిన్న బటన్లు నీటిని ఆదా చేస్తాయి. మీరు మూత్ర విసర్జన చేసిన సమయంలో చిన్న బటన్‌ను నొక్కాలి. ద్రవ వ్యర్థాలను ఫ్లష్ చేయడానికి చిన్న బటన్‌ను ఉపయోగించాలి. మలవిసర్జన తర్వాత, కమోడ్ నుంచి వ్యర్థాలను ఫ్లష్ చేయడానికి పెద్ద బటన్‌ను నొక్కాలి. దీనికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. మూత్రాన్ని ఫ్లష్ చేయడానికి తక్కువ నీరు అవసరం, అందుకే చిన్న బటన్ అందించబడుతుంది.

రెండు బటన్లను నొక్కితే ఏమి జరుగుతుంది

చాలా సార్లు రెండు బటన్లు హడావిడిగా నొక్కబడతాయి. రెండు బటన్లను నొక్కడం వల్ల ఎక్కువ నీరు వస్తుందని.. తద్వారా మరుగుదొడ్డిలోని మురికిని ఒక్కసారిగా శుభ్రం అవుతుందని అనుకుంటారు. కానీ అలా జరగదు. ఒకేసారి రెండు బటన్లు నొక్కితే ఫ్లష్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది. ట్యాంక్ సామర్థ్యం కంటే ఎక్కువ నీరు బయటకు వస్తుంది. దీని వల్ల నీరు వృధా అవుతుంది. ఈ టూ బటన్ సిస్టమ్ నీటిని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

Also Read: Cancer : ఈ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణం..? కొనేటప్పుడు జాగ్రత్త.!

Advertisment
తాజా కథనాలు