Hero Ravi Teja: రవితేజను మాస్ మహారాజ అని ఫస్ట్ పిలిచిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

అభిమానులంతా హీరో రవితేజను 'మాస్ మహారాజ' అనే ట్యాగ్ తో పిలుస్తారు.దీనికి కారణం డైరెక్టర్ హరీష్ శంకర్.. 'షాక్' మూవీ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ రవితేజను స్టేజ్ పైకి పిలిచేటప్పుడు మాస్ మహారాజ అని పిలిచారు. అప్పటి నుంచి అభిమానులు ఈ ట్యాగ్ తో పిలుస్తారు.

Hero Ravi Teja: రవితేజను మాస్ మహారాజ అని ఫస్ట్ పిలిచిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
New Update

Hero Ravi Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు రవితేజ.  కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. అంతే కాదు దర్శకుడు కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు. 1997 లో కృష్ణ వంశీ దర్శకత్వంలో "సింధూరం" సినిమాలో సెకండ్ హీరోగా చేశారు. ఆ సినిమాలోని రవితేజ పాత్ర జనాలను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత  హీరోగా పలు సినిమాల్లో నటించినప్పటికీ కెరియర్ లో మంచి బ్రేక్ రాలేదు. ఆ తర్వాత 2002 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇడియట్'  సినిమాతో రవితేజ స్టార్ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రవితేజ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. వరుస విజయాలతో స్టార్ డమ్ దక్కించుకున్నారు రవితేజ. ప్రతి హీరోకు స్టార్ డమ్ వచ్చాక అభిమానంతో బిరుదులు ఇచ్చేస్తారు ఫ్యాన్స్ .. ఇక రవితేజకు 'మాస్ మహారాజ' అనే బిరుదును ఇచ్చేశారు.

Also Read: Varun-Lavanya Marriage:పెళ్ళి వీడియో అమ్ముకోలేదు..క్లారిటీ ఇచ్చిన వరుణ్ టీమ్

అయితే రవితేజకు మాస్ మహారాజ అనే ట్యాగ్ ఎలా వచ్చిందంటే..? గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన 'షాక్' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అంతే కాదు ఈ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారాడు. 'షాక్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రతి ఒక్కరిని ఏదైనా ట్యాగ్ తో స్టేజ్ మీదకు పిలవాలని అనుకున్నారంట. అదే సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజను 'మాస్ మహారాజ' అని పిలిచారు.  ఇక అప్పటి నుంచి రవితేజను తన అభిమానులంతా మాస్ మహారాజ అని పిలవడం మొదలు పెట్టారు.

Also Read: Allu Arjun-Amittab: నటించలేదు..జీవించాడు..బన్నీకి బిగ్‌ బి ప్రశంసలు!

#ravi-teja #mass-maharaja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe