SmartPhone: ఈ పవర్ ఫుల్ ఫోన్‎పై..ఏకంగా రూ. 4000 డిస్కౌంట్..పూర్తివివరాలివే.!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ రియల్మీ తన రియల్మీ నార్జో ఎన్53 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 4జీబీ, 54జీబీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ. 10000కి కాకుండా రూ. 7,999కి కొనుగోలు చేయవచ్చు. ఎంఆర్పీ ధరపై 27శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

New Update
SmartPhone:  ఈ పవర్ ఫుల్ ఫోన్‎పై..ఏకంగా రూ. 4000 డిస్కౌంట్..పూర్తివివరాలివే.!

Realme Narzo N53:  మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ కంపెనీ అయిన రియల్మీ కూల్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.ఈ డీల్ గురించ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

రియల్మీ నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్ అమెజాన్ (Amazon) నుంచి బేస్ 4జీబీ + 64జీబీ వేరియంట్‌ను రూ. 10,999కి బదులుగా రూ.7,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే కస్టమర్లకు ఎమ్మార్పీ ధరపై ఏకంగా 27 శాతం తగ్గింపు ఇస్తున్నారు. దీంతోపాటు ఇక్కడి వినియోగదారులకు రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. చెక్అవుట్ సమయంలో ఫోన్ ధర రూ.7,499 అవుతుంది. అంతేకాదు వినియోగదారులు అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.అమెజాన్‌లో వినియోగదారులకు కొన్ని ఇతర ఆఫర్‌లతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం..తెలుగు రాష్ట్రాల్లో ఇవే.!

రియల్మీ నార్జో ఎన్ 53 స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుంటే...ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ , Unisoc T612 ప్రాసెసర్‌తో 6.74-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, దాని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 8మోగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ 5000ఎంఏహెచ్, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు