ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ ( Realme C53) తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme C53ని గతవారం భారత్‌లో విడుదల చేసింది. లాంచ్ చేసిన మరుసటి రోజు, ఫోన్ కొన్ని గంటల పాటు ఎర్లీ బర్డ్ సేల్ కింద అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది, ఆ తర్వాత ఫోన్ మళ్లీ రెండు గంటల ప్రత్యేక సేల్ కింద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ పరికరం. దీన్ని రూ. 10వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ధర విభాగంలో 108మెగాపిక్సెల్ వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం గమనార్హం.
ఈ లెటెస్ట్ Realme C53 ఫోన్ అతి ముఖ్యమైన ఫీచర్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. దీనిని రూ. 1000రూపాయలలోపు కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా Realme C53 సి53లో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, 128 జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999కి అందుబాటులో ఉంది. 6జీబి ర్యామ్, 64 జీబి స్టోరేజీ వేరియంట్ ను రూ. 10,999కి విడుదల చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. జూలై 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీ వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి ఉంటుంది.
ఇక లాంచ్ ఆఫర్ గురించి మాట్లాడుకుంటే..ఈ ఫోన్ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డు, హెచ్ డిఎఫ్ సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసినట్లయితే వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 4జీబి ర్యామ్, 64 జిబి ఇంబిల్ట్ స్టోరేజీకి మాత్రమే వర్తిస్తుంది.
Realme C53 స్పెసిఫికేషన్స్:
Realme C53 స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల (1600*720పిక్సెల్స్)HD+IPS LCDస్క్రీన్ కలిగి ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 180 Hz. స్క్రీన్ బ్రైట్ నెస్ 560 నిట్ ల వరకు అందిస్తుంది. UNISOC T612ఆక్టాకోర్ 12nm ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్లో పొందుపరిచారు. గ్రాఫిక్స్ కోసం Mail-G57 GPU ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్, 12జిబి ఇంబిల్ట్ స్టోరేజీ, 6జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీని 2టిబి వరకు విస్తరించుకోవచ్చు.
అంతేకాదు ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ ని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధరిత రియల్ మీUI T ఎడిషన్ తో వస్తుంది. స్మార్ట్ ఫోన్ కు శక్తిని అందించేందుకు 18వాట్స్ ఛార్జింగ్ కు సపోర్టు చేసే 5000ఏంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్ తోపాటు డెప్త్ సెన్సార్ ఎపర్చరు F/1.8తో ఉంటుంది.
ఫోన్ బ్యాక్ సైడ్ ప్యానెల్ లో ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సెప్టీకోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. హ్యాండ్ సెట్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ ఉంటుంది. వైఫై, బ్లూటూత్ 5.0. జీపీఎస్, యూఎస్బీ టైప్ -సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.