Atchutapuram : అనకాపల్లి జిల్లా (
Anakapalle District) అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీ (
Pharma Company) లో ఘోర ప్రమాదం జరిగింది. సెజ్ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి (
Reactor Explode) సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట