Reactor Blast : అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్..18 మందికి పైగా!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

New Update
Fire Accident : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ప్రాంతాలను చుట్టుముట్టిన రసాయన పొగ
Atchutapuram : అనకాపల్లి జిల్లా (Anakapalle District) అచ్యుతాపురం సెజ్‌ లోని ఓ ఫార్మా కంపెనీ (Pharma Company) లో ఘోర ప్రమాదం జరిగింది. సెజ్‌ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలి (Reactor Explode) సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు