RBI Quiz: ఆర్బీఐ క్విజ్... ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న వేళ డిగ్రీ విద్యార్ధులకు క్విజ్ పోటీలను నిర్వహించనుంది.సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు.గెలిచిన వారికి భారీ నగదును బహుమతిగా అందజేయనున్నారు.

RBI Quiz: ఆర్బీఐ క్విజ్... ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా!
New Update

RBI Quiz: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న వేళ డిగ్రీ విద్యార్ధులకు ఓ శుభవార్త చెప్పింది. భారీ ప్రైజ్ మనీతో డిగ్రీ విద్యార్ధులకు ఆర్బీఐ క్విజ్ పోటీలను నిర్వహించనుంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆసక్తి కల్గిన విద్యార్ధులు ఈ నెల 17 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆర్బీఐ వారు ఈ పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్ధుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ, రిజర్వు బ్యాంకు గురించి అవగాహన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1నాటికి 25ఏళ్ల లోపు వయసు ఉండి ఏదైనా డిగ్రీ చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు ఈ పోటీలకు అర్హులుగా ఆర్బీఐ పేర్కొంది.

దేశ వ్యాప్తంగా నాలుగు దశల్లో ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఈ క్విజ్ పోటీల విజేతలకు ప్రైజ్ మనీతో పాటు సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. జోనల్ స్థాయిలో సత్తా చాటిన వారికి జాతీయ స్థాయిలో ఫైనల్ రౌండ్ నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురు విజేతలకు రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు చొప్పున ప్రైజ్ మనీ ని ఆర్బీఐ అందిస్తుంది.

ఇక జోనల్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.5లక్షలు, రూ.4లక్షలు, రూ.3లక్షలు చొప్పున ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో వరుసగా రూ.2లక్షలు, లక్షన్నర, లక్ష చొప్పున నగదు బహుమతి కూడా అందజేస్తారు. ఇతర వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి https://www.rbi90quiz.in/ రిజిస్టార్‌ అవ్వాలి.

Also Read: తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు..జర జాగ్రత్త!

#rbi #quiz #compitition
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe