RBI vs Banks: ఆర్బీఐ మాట బ్యాంకులు పట్టించుకోవడం లేదా? బ్యాంకింగ్ సెక్టార్ లో ఏమి జరుగుతోంది?

లోన్స్ విషయంలో ముఖ్యంగా అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ సూచనలను దేశంలోని బ్యాంకులు పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఈ ఏడాది పెరిగిన క్రెడిట్ కార్డు బకాయిలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
RBI vs Banks: ఆర్బీఐ మాట బ్యాంకులు పట్టించుకోవడం లేదా? బ్యాంకింగ్ సెక్టార్ లో ఏమి జరుగుతోంది?

RBI vs Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సహకార బ్యాంకులకు బాస్‌గా పరిగణిస్తారు. రిజర్వ్ బ్యాంక్ సూచనలు లేదా సలహాలు ఇస్తే, బ్యాంకులు దానిని అనుసరించాలి. కానీ ఇప్పుడు బ్యాంకులు ఆర్‌బిఐ మాట వినడం లేదని, ముఖ్యంగా అన్‌సెక్యూర్డ్ రుణాల విషయంలో అసలు ఆర్బీఐ సూచనలు పట్టించుకోవడం లేదనీ చెబుతున్నారు.  రిజర్వ్ బ్యాంక్ దీన్ని బ్యాంకులకు పెను ముప్పుగా పరిగణిస్తున్నా బ్యాంకులు అంగీకరించడం లేదు. పూచీకత్తు లేని రుణాలను అంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్ విరివిగా ఇచ్చేస్తున్నాయి. ఈమధ్య వచ్చిన ఓకే రిపోర్టు ప్రకారం, గత ఏడాది కాలంలో దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 17 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో, బ్యాంకుల బకాయిలు దాదాపు 25% పెరిగాయి.

RBI vs Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా చూస్తే.. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశంలో జారీ అయిన మొత్తం కొత్త క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య 10 లక్షలు దాటింది. RBI చెబుతున్న దాని ప్రకారం, మార్చి 2024 వరకు దేశంలో మొత్తం 10.18 కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. అయితే, దానికి ఒక సంవత్సరం ముందు అంటే మార్చి 2023 వరకు దేశంలో మొత్తం 8.65 కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే క్రెడిట్ కార్డుల సంఖ్య 17 శాతానికి పైగా పెరిగింది.

Also Read: ట్విట్టర్ ఇప్పుడు పూర్తిగా X .. మస్క్ మార్చేశాడు..

క్రెడిట్ కార్డ్ బాకీ పెరుగుతోంది
RBI vs Banks: దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య పెరగడమే కాకుండా, క్రెడిట్ కార్డ్ బాకీలు కూడా చాలా వేగంగా పెరిగాయి . మార్చి 2024 నాటికి దేశంలో క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ. 2.57 లక్షల కోట్లు కాగా, మార్చి 2023 నాటికి రూ. 2.04 లక్షల కోట్లు. అంటే ఒక్క ఏడాదిలో 25 శాతం భారీ జంప్‌ నమోదైంది. 2022తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ బాకీ 66.88% పెరిగింది. 2022లో బకాయి రూ.1.54 లక్షల కోట్లు.

క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో ప్రైవేట్ బ్యాంకుల ఆధిపత్యం..
RBI vs Banks: మనం క్రెడిట్ కార్డ్ మార్కెట్ విషయానికి వస్తే, అది పూర్తిగా ప్రైవేట్ బ్యాంకుల నియంత్రణలో ఉంటుంది. దేశ క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 20 శాతానికి పైగా వాటాతో ముందంజలో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొత్తం 2.06 కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేయగా, ఎస్‌బిఐ కార్డ్ 18 శాతం వాటాతో మొత్తం 1.89 కోట్ల క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసింది. దీని తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 1.69 లక్షలు, యాక్సిస్ 1.42, కోటక్ బ్యాంక్ 59 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. అయితే, ప్రస్తుతం RBI కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను నిషేధించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు