RBI Surplus: 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2,10,874 కోట్ల మిగులు(Surplus) బదిలీని ఆర్‌బీఐ బోర్డు ఆమోదించింది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ. 87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. అంటే గతేడాది కంటే రూ.1.23 లక్షల కోట్లు ఎక్కువ.
RBI Surplus: ఈ మిగులు బదిలీ FY24కి సంబంధించినది. అయితే, ఇది FY25కి సంబంధించిన ప్రభుత్వ ఖాతాల్లో ప్రతిబింబిస్తుంది. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 608వ సమావేశంలో మిగులును ప్రకటించారు. ఈ సమావేశం మే 22న ముంబైలో గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగింది.
RBI Surplus: ఆదాయం .. వ్యయం మధ్య వ్యత్యాసాన్ని మిగులు(Surplus) అంటారు. రిజర్వ్‌లు .. నిలుపుకున్న ఆదాయాల కేటాయింపు తర్వాత RBI మిగులును ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ బదిలీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 47 (మిగులు లాభాల కేటాయింపు) ప్రకారం జరుగుతుంది.
Also Read: ఆకాశానంటుతున్న కంచి పట్టు చీరల ధరలు..రెండేళ్లలో 50 శాతం పెరుగుదల!
RBI కి మిగులు ఎలా వస్తుంది?
ఆర్బీఐ కి ఆదాయం:
- దేశీయ.. విదేశీ సెక్యూరిటీల హోల్డింగ్‌పై వడ్డీ
- సేవల నుండి ఫీజు .. కమీషన్
- విదేశీ మారకపు లావాదేవీల ద్వారా లాభం
- సబ్సిడరీ .. అసోసియేట్ కంపెనీల నుండి రిటర్న్స్
RBI ఖర్చులు:
- కరెన్సీ నోట్ల ముద్రణ
- డిపాజిట్లు .. రుణాలపై వడ్డీ చెల్లింపు
- ఉద్యోగుల జీతం .. పెన్షన్
- కార్యాలయాలు .. శాఖల నిర్వహణ ఖర్చులు
- ఆకస్మిక డబ్బు అవసరం .. తరుగుదల కోసం కేటాయింపు
అత్యధిక మిగులు:
RBI Surplus: ఇది ఇప్పటివరకు అత్యధిక వార్షిక మిగులు బదిలీగా చెప్పవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫారెక్స్ హోల్డింగ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆదాయాలు మిగులు మొత్తం భారీగా పెరగడానికి ఒక కారణం. కేంద్రం లిక్విడిటీ మిగులు .. తదుపరి ఖర్చులకు సపోర్ట్ ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంచనా వేసిన దాని కంటే ఎక్కువ మిగులు కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త అని నిపుణులు అంటున్నారు.
- దీనివల్ల ప్రభుత్వం ఆర్థిక లోటును తగ్గించుకోవచ్చు.
- ప్రభుత్వం కొత్త పథకాలకు డబ్బు ఖర్చు చేయడం సులభం అవుతుంది
- డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం తప్పిపోయిన తర్వాత ఆదాయ సేకరణలో లోటుకు పరిహారం
ఆర్థిక లోటు 0.4% తగ్గుతుంది..
RBI Surplus: కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసనా భరద్వాజ్ మాట్లాడుతూ, ఈ డివిడెండ్ FY 25 లో ద్రవ్య లోటును 0.4% తగ్గిస్తుంది. బిమల్ జలాన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ మిగులును ఇస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ సిఫార్సులను రిజర్వ్ బ్యాంక్ ఆగస్టు 26, 2019న ఆమోదించింది.