RBI RDG App: వారికోసం RBI రిటైల్ డైరెక్ట్ యాప్.. ఇది ఏమిటి? తెలుసుకుందాం!

ఆర్బీఐ రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం RBI రిటైల్ డైరెక్ట్ యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనవచ్చు. అమ్మవచ్చు. ఈ యాప్ గురించి.. ప్రభుత్వ సెక్యూరిటీల గురించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

RBI RDG App: వారికోసం RBI రిటైల్ డైరెక్ట్ యాప్.. ఇది ఏమిటి? తెలుసుకుందాం!
New Update

RBI RDG App: భారతీయ రిజర్వ్ బ్యాంక్ 'RBI రిటైల్ డైరెక్ట్' మొబైల్ యాప్‌ను మంగళవారం(మే 28) ప్రారంభించింది. దీని ద్వారా, రిటైల్ పెట్టుబడిదారులు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు..విక్రయించవచ్చు. ఈ యాప్ iOS అలాగే Android వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ నవంబర్ 2021లో ప్రారంభించారు. అప్పటి నుండి, రిటైల్ పెట్టుబడిదారులు rbiretaildirect.org.in వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ కోసం యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అంటే ఏమిటి?

RBI RDG App:  రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ రిటైల్ పెట్టుబడిదారులను ప్రైమరీ-సెకండరీ మార్కెట్ల నుండి ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను (G-Secs) కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. చిన్న పెట్టుబడిదారులు ఇప్పుడు గిల్ట్ సెక్యూరిటీస్ ఎకౌంట్ ను తెరవడం ద్వారా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతా రిజర్వ్ బ్యాంక్‌లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎకౌంట్ ను రిటైల్ డైరెక్ట్ గిల్ట్ (RDG) ఎకౌంట్ అంటారు.

ఎక్కడ పెట్టుబడి పెట్టవచ్చు?

  • భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో, అంటే ఒక సంవత్సరానికి పైగా ప్రభుత్వ పేపర్ బిల్లులు.
  • భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్లులలో. ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ప్రభుత్వ సెక్యూరిటీలను ట్రెజరీ బిల్లులు అంటారు.
  • సావరిన్ గోల్డ్ బాండ్లలో (SBG). ఇవి బంగారం ధర వద్ద జారీ చేస్తారు. కానీ మీకు ఫిజికల్ గా బంగారం లభించదు. ఆర్‌బీఐ ప్రతి నెలా వీటిని జారీ చేస్తుంది.
  • రాష్ట్ర అభివృద్ధి రుణాలలో (SDL). రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వీటిని జారీ చేస్తుంది. ఇలా – రాష్ట్రంలో రోడ్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణాల కోసం ఈ బాండ్స్ ద్వారా నిధులు సేకరిస్తారు.

RDG ఎకౌంట్ ను ఎవరు ఓపెన్ చేయవచ్చు?

RBI RDG App: జూలై 12, 2021 నాటి RBI నోటిఫికేషన్ ప్రకారం, రిటైల్ పెట్టుబడిదారులు RDG ఖాతాను తెరవవచ్చు. ఇందుకోసం అతను కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. సేవింగ్ బ్యాంక్ ఖాతాను భారతదేశంలో నిర్వహించాలి. PAN కార్డ్‌తో పాటు, అతను తప్పనిసరిగా ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా KYC కోసం ఏదైనా అధికారిక పత్రాన్ని కలిగి ఉండాలి.

RBI RDG App: RDG ఖాతాను తెరిచేటప్పుడు, ఇమెయిల్ ID - రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను కూడా అందించాలి. RDG ఖాతాను ఒకరి స్వంత పేరుతో లేదా మరొక రిటైల్ పెట్టుబడిదారుతో సంయుక్తంగా తెరవవచ్చు. కానీ ఇతర పెట్టుబడిదారుడు కూడా అన్ని నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది.

Also Read: నిమిషానికి పదిలక్షల సంపాదన.. LIC రేంజ్ ఒకరకంగా లేదుగా!

ఖాతాకు ఎటువంటి ఛార్జీలు లేవు

RDG ఖాతాకు ఎటువంటి ఛార్జీలు లేవు. దీన్ని నిర్వహించడానికి ప్రారంభ ఛార్జీ లేదా ఎటువంటి ఛార్జీ లేదు. అయితే, పేమెంట్ గేట్‌వేకి ఏదైనా ఛార్జీ ఉంటే, పెట్టుబడిదారుడు ఆ ఛార్జీని చెల్లించాలి.

ప్రభుత్వ భద్రత అంటే ఏమిటి?

భారత ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ నుండి రుణాలు తీసుకోవడం కోసం ఇటువంటి బాండ్స్ ఇష్యూ చేస్తాయి. దీనినే గవర్నమెంట్ సెక్యూరిటీ అంటారు. ఇది ప్రభుత్వ డాక్యుమెంట్.. దాని గ్యారెంటీని ప్రభుత్వం తీసుకుంటుంది.

#rbi #rbi-rdg-app #investors
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe