Cheque Clearance: ఆర్బీఐ సంచలనం.. ఇక చెక్ క్లియరెన్స్ గంటల్లోనే.. 

ఆర్బీఐ చెక్ క్లియరెన్స్ విషయంలో మార్పులు తీసుకురాబోతోంది. ఇంతవరకూ చెక్ క్లియర్ కావాలంటే రోజుల సమయం పట్టేది. అంటే చెక్ క్లియరింగ్ సైకిల్ T+1గా ఉండేది. ఇప్పుడు దానిని మార్చి గంటల వ్యవధికి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. త్వరలో గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు. 

New Update
RBI MPC Decisions: వారికి ఆర్బీఐ ఊరట.. వడ్డీరేట్లు పెంచలేదు.. 

Cheque Clearence: సాధారణంగా ఏదైనా పేమెంట్ కోసం చెక్ మనం తీసుకుంటే, అది బ్యాంక్ లో డిపాజిట్ చేసిన తరువాత రెండు మూడు రోజుల వరకూ (బ్యాంక్ ను బట్టి) సమయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం డిపాజిట్ చేసిన తేదీ తరువాత చెక్ క్లియర్ కావడానికి రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు ఆర్బీఐ ఈ విషయంపై దృష్టి సారించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBI చెక్ క్లియరింగ్ సైకిల్‌ను T+1 రోజుల నుండి కొన్ని గంటలలోపునాకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఆగస్టు 8న ద్రవ్య విధాన కమిటీ ప్రకటన సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సమాచారాన్ని అందించారు.

Cheque Clearence: చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ప్రస్తుతం 2 పని దినాల క్లియరింగ్ సైకిల్‌తో చెక్‌లను ప్రాసెస్ చేస్తుంది. దీని కోసం, బ్యాచ్ క్లియరింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు.  అంటే ఒక నిర్ణీత సమయంలో వచ్చిన చెక్స్ అన్నిటినీ ఒకేసారి క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఇది నిరంతర క్లియరింగ్‌కు మారుస్తారు. అంటే, పని వేళల్లో చెక్ క్లియరింగ్ ప్రక్రియ కంటిన్యూగా కొనసాగుతుంది. చెక్ స్కాన్ చేస్తారు.. సబ్మిట్ చేస్తారు. తరువాత చెక్ ట్రంక్ సిస్టమ్‌లో చెక్ స్కాన్ స్కాన్ చేసి సబ్మిట్ చేస్తారు. ఆ తరువాత వెంటనే అది అప్రూవ్ అవుతుంది.  ఈ కొత్త వ్యవస్థపై ఆర్‌బీఐ త్వరలో స్పెసిఫిక్ డిటైల్డ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

కొన్ని గంటలలోపు డబ్బులు ఎకౌంట్ లోకి..
Cheque Clearence:ఖాతాదారులకు కొన్ని గంటల్లోనే నిధులు అందుతాయి కాబట్టి కస్టమర్ అనుభవం కూడా మెరుగుపడుతుంది. ఈ మార్పు చెక్ ఆధారిత లావాదేవీలకు సంబంధించిన అనిశ్చితిని తగ్గించగలదని భావిస్తున్నారు.

చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటి?
Cheque Clearence: చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అనేది చెక్కులను క్లియర్ చేసే ప్రక్రియ. ఇందులో, ఇష్యు చేసిన చెక్ ఫిజికల్ గా  ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరాల్సిన అవసరం లేదు, దీనికి బదులుగా చెక్కును ఫోటో తీయడం ద్వారా క్లియర్ చేస్తారు. వాస్తవానికి, పాత విధానంలో, చెక్కును సబ్మిట్ చేసిన బ్యాంకు నుండి చెక్ ఎవరైతే ఇచ్చారో వారిబ్యాంక్ బ్రాంచ్ కి పంపిస్తారు.  అక్కడ నుంచి అప్రూవల్ వచ్చాకా పేమెంట్ చేస్తారు. అందువల్ల క్లియర్ చేయడానికి సమయం పడుతుంది. ఇప్పుడు తీసుకురాబోయే చెక్ ట్రాంకేషన్ సిస్టం లో చెక్ స్కాన్ చేయడం ద్వారా వెంటనే క్లియర్ అయిపోయే అవకాశం దొరుకుతుంది. 

వరుసగా 9వ సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు
Cheque Clearence: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను మార్చలేదు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతం వద్ద ఉంచింది. అంటే లోన్ ఖరీదైనది కాబోదు. అలాగే,  మీ EMI కూడా పెరగదు. ఆర్‌బిఐ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో 0.25% నుండి 6.5%కి పెంచింది.

ఆగస్టు 6 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వివరాలు వెల్లడించారు. ఈ సమావేశం ప్రతి రెండు నెలలకోసారి జరుగుతుంది. అంతకుముందు జూన్‌లో జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచలేదు.

ఆర్‌బీఐ ఎంపీసీలో ఆరుగురు సభ్యులున్నారు. ఇందులో బయటి అధికారులు,  RBI అధికారులు ఉన్నారు. గవర్నర్ దాస్‌తో పాటు ఆర్‌బిఐ అధికారి రాజీవ్ రంజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అలాగే, మైఖేల్ దేబబ్రత పాత్ర డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. శశాంక్ భిడే, అషిమా గోయల్ అదేవిధంగా జయంత్ ఆర్ వర్మ బయట నుంచి సభ్యులుగా ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు