Bank News: మహారాష్ట్రలోని షిర్పూర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ పై నిషేధం విధించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసినందున పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్బీఐ నిర్ణయం వల్ల ఖాతాదారులు ఏ విధంగానూ బ్యాంకు నుండి డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు. తదుపరి 6 నెలల వరకు కస్టమర్‌లు బ్యాంకు నుండి డబ్బు విత్ డ్రా చేసుకోలేరు. నగదు లావాదేవీలే కాకుండా ఇతర లావాదేవీలకు కూడా రిజర్వ్ బ్యాంక్ అడ్డుకట్ట వేసినట్లు పేర్కొంది. అంతేకాదు సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలు మాత్రమే కాదు .. ఇతర లావాదేవీలు అంటే రుణాలు, క్రెడిట్ కార్డులతో సహా అన్ని రకాల డబ్బు లావాదేవీలు చేయడానికి వీల్లేదు.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ప్రభుత్వ బ్యాంకు ఖాతాదారులు నెత్తిపై మొట్టికాయ వేసింది. ఎందుకంటే డిపాజిట్‌ను ఎలా విత్‌డ్రా చేయాలనే దానిపైనే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎకనామిక్స్ టైమ్స్ ద్వారా వచ్చిన వార్తా నివేదిక ఆధారంగా ఈ వార్త తెలిసింది. ఇది మొదటిసారి కాదు ఆర్‌బీఐ ఇప్పటికే పలు బ్యాంకులపై ముందస్తు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో యెస్ బ్యాంక్ నుంచి విత్‌డ్రాలపై కూడా ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ఈతరహా ఆంక్షలు విధించడం ఇప్పుడే కొత్త కాదు. కానీ ఖాతాదారులకు మాత్రం ఇదో తలనొప్పిగా మారుతోంది. ఈ పరిమితి సాధారణంగా బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఆధారంగా జారీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహారాష్ట్రలోని షిర్పూర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై నిషేధం విధించినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: తిరగబడ్డ బాణం.. అన్నపై షర్మిల పోరాటం ఎందుకు?