Kotak Mahindra: కోటక్ మహీంద్రాకు ఆర్బీఐ బిగ్ షాక్.. క్రెడిట్ కార్డులతో పాటు, ఆన్లైన్ బ్యాంకింగ్..

కోటక్ మహీంద్రా బ్యాంక్ కు రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. నూతన క్రెడిట్ కార్డుల జారీని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా.. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్‌లను చేర్చుకోవద్దని స్పష్టం చేసింది ఆర్బీఐ.

New Update
Kotak Mahindra: కోటక్ మహీంద్రాకు ఆర్బీఐ బిగ్ షాక్.. క్రెడిట్ కార్డులతో పాటు, ఆన్లైన్ బ్యాంకింగ్..

ప్రముఖ ప్రైవేట్ రంగం బ్యాంక్ కోటక్ మహీంద్రాకు (Kotak Mahindra) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India) ఆంక్షలు విధించింది. నూతన క్రెడిట్ కార్డుల జారీని వంటనే నిలిపివేయాలని కోటక్ మహీంద్రాను ఆదేశించింది ఆర్బీఐ. ఇంకా.. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ (Online, Mobile banking) మార్గాల ద్వారా కొత్త కస్టమర్‌లను చేర్చుకోవడంపై కూడా ఆంక్షలు విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కు సంబంధించిన ఐటీ వ్యవస్థలో లోపాలను సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. దీనిపై బ్యాంకు నుంచి వివరణ కోరింది ఆర్బీఐ.
ఇది కూడా చదవండి:LIC: ఎల్‌ఐసీ అదిరే స్కీమ్‌.. ఈ ప్లాన్ చేస్తే నెలకు 10 వేల పెన్షన్‌!

ఈ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. 2022, 2023లో జరిగిన ఐటీ విచారణ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని మొత్తం క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో బ్యాంక్ 4 శాతం వాటా కలిగి ఉంది. 2023లో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ బ్యాంకింగ్ లైసెన్స్ పొందింది. బ్యాంక్‌గా మార్చబడిన తొలి NBFC ఇదే కావడం విశేషం.

ఆర్బీఐ చర్యలకు కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుందన్న అంశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. ప్రస్తుతం ఇప్పటికే కొటాక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఖాతాలు కలిగి ఉన్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు గతం లాగే బ్యాంక్ సేవలను పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు