UPI: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక రూ. 5 లక్షల వరకు పేమెంట్స్ చేయొచ్చు..

యూపీఐ యూజర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ పేమెంట్స్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. ఇంతకు ముందు రూ. 1 లక్ష వరకే ఉండేది. అయితే, పెంచిన పరిమితి కేవలం హాస్పిటల్స్, ఎడ్యూకేషన్ సొసైటీస్‌కు చెల్లించేందుకు మాత్రమే వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

UPI: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక రూ. 5 లక్షల వరకు పేమెంట్స్ చేయొచ్చు..
New Update

UPI Payments: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటి నుంచి యూపీఐ ద్వారా రూ. 5 లక్షల వరకు చెల్లించవచ్చు అని ప్రకటించింది. అయితే కండీషన్స్ అప్లై అని బ్రేక్స్ కూడా వేసింది. హాస్పిటల్స్, విద్యా సంస్థల్లో చెల్లింపునకు మాత్రమే ఈ పరిమితి అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. శుక్రవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హాస్పిటల్స్, ఎడ్యూకేషన్ సొసైటీలకు యూపీఐ ద్వారా రూ. 5 లక్షల వరకు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం యూపీఐ ద్వారా రూ. 1 లక్ష వరకు లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంది. అన్ని రకాల లావాదేవీలు లక్ష వరకు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ నిర్ణయం యూపీఐ వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.

ఇది మాత్రమే కాదు.. రికరింగ్ పేమెంట్స్ కోసం ఈ-మ్యాండేట్స్ పరిమితిని కూడా రూ. 1 లక్షకు పెంచింది ఆర్బీఐ. ఒక్కో లావాదేవీ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచుతున్నట్లు ఆర్బీఐ చైర్మన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డ్ బకాయిల రికరింగ్ పేమెంట్స్ మరింత సులభతరం కానున్నాయి.


Also Read:

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం

పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?

#upi-payments #upi-transaction-limits
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe