Big Breaking: ఆర్బీఐ గుడ్ న్యూస్.. 2 వేల నోట్ల విషయంలో కీలక ప్రకటన..

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రూ. 2000 నోట్ల మార్పిడికీ ఇవాళ్టితో గడువు ముగియనుండగా.. ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ. రూ2000 నోట్లను మార్పిడి చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
Big Breaking: ఆర్బీఐ గుడ్ న్యూస్.. 2 వేల నోట్ల విషయంలో కీలక ప్రకటన..

RBI Extends Deadline to Exchange Rs 2,000 Notes: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రూ. 2000 నోట్ల మార్పిడికీ ఇవాళ్టితో గడువు ముగియనుండగా.. ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ. రూ2000 నోట్లను మార్పిడి చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ పలు బ్యాంకులకు సెలవు ఉండటం, రేపు ఆదివారం కావడం, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి కావడంతో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దాంతో ప్రజలు తమ వద్దనున్న రూ. 2 వేల నోట్లను మార్చుకోవడానికి ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో ఛాన్స్ ఇస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 7వ తేదీ వరకు రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చునని తెలిపింది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. పెద్ద నోట్లను ఉపసంహరణ కోసం రూ. 2000 నోట్లను ఎక్స్‌ఛేంజ్ ఇవ్వాలని సూచించింది. ఇక ఎవరైనా తమ వద్ద పెద్ద నోట్లు ఉన్నట్లయితే.. వారు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం గానీ, వాటి స్థానంలో వేరే నోట్లను మార్చుకోవడం చేసుకోవచ్చు అని తెలిపింది.

ఈ ఏడాది మే 19వ తేదీన రూ. 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ. ప్రజలు తమ వద్దనున్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం గానీ, ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం గానీ చేయాలని సూచించింది. ఇందుకోసం నాలుగు నెలలు గడువు ఇచ్చింది. అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు నేటితో ముగియనుండగా.. కీలక నిర్ణయం తీసుకుంది. గడువును మరో 7 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Also Read:

Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన

Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్

Advertisment
తాజా కథనాలు