AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ మా కుటుంబాన్ని నాశనం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాయపాటి రంగారావు. ఆర్టీవీతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో మాకు సరైనా గుర్తింపు లేదని అందుకే పార్టీ నుండి బయటకు వచ్చానని అన్నారు. టీడీపీలో ఎప్పుడూ డబ్బు.. డబ్బు..డబ్బు..అంతా అవినీతే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Also Read: వైసీపీ మీటింగ్కు డుమ్మా.. థియేటర్లో చిల్ అవుతున్న ఎమ్మెల్యే బాలినేని..!
బిజినెస్ హౌస్
చంద్రబాబు, నారా లోకేష్ మమ్మల్ని వేధించి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ పొలిటికల్ పార్టీ కాదని అది బిజినెస్ హౌస్ అని దుయ్యబట్టారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గరున్నాయన్నారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సత్తెనపల్లి నుంచి టీడీపీ సీటు ఆశించినట్లు తెలిపారు. అయితే వారు డబ్బులు అడిగారని తెలిపారు. తమకు మాటమాత్రం చెప్పకుండా కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. పోలవరం నిర్మాణం కాంట్రాక్టు మాకు వస్తే సబ్ కాంట్రాక్టులు చంద్రబాబు తన అనుచరులకు ఇప్పించాడని అన్నారు.
Also Read: హిందూపురంలో అందుకే ఓడిపోతున్నాం: మంత్రి పెద్దిరెడ్డి
లా గెలుస్తాడో చూస్తా
అసలు లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ సవాల్ చేశారు. లోకేష్ ను ఓడించడమే తన మొదటి టాస్క్ అని పేర్కొన్నారు. వైసీపీ ఆహ్వానిస్తే తప్పకుండా పార్టీలో చేరతానని..ఎక్కడ నుంచి పోటీ చెయ్యమంటే అక్కడ పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీలో పదవి లేకపోయిన గౌరవం ఉంటే చాలని కామెంట్స్ చేశారు.