AP: అమిగోస్ సంస్థ ప్రతినిధులు మమ్మల్ని మోసం చేశారు.. రవీంద్రారెడ్డి దంపతుల ఆవేదన..!

అమిగోస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన రవీంద్రారెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదివేల టిప్పర్ల మట్టిని తోలుకొని కేవలం రూ. 3 లక్షలు ఇచ్చారని మిగితా డబ్బులు అడుగుతే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.

AP: అమిగోస్ సంస్థ ప్రతినిధులు మమ్మల్ని మోసం చేశారు.. రవీంద్రారెడ్డి దంపతుల ఆవేదన..!
New Update

Ananthapur: అమిగోస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన రవీంద్రారెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలంలో మట్టిని తవ్వుకొని టిప్పర్ కు రూ. 900 చెల్లిస్తామని చెప్పారన్నారు. దాదాపు పదివేల టిప్పర్ల మట్టిని తోలుకొని మొదట్లో ఇచ్చిన మూడు లక్షల రూపాయలు తప్ప ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు చంపుతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.

Also read: టీడీపీ ఆఫీసుపై దాడి.. వైసీపీ కీలక నేతలు అరెస్ట్.!

పంటలు పండే పొలాన్ని వారికి ఇచ్చి పూర్తిగా నష్టపోయామన్నారు.  దాదాపు 70 నుంచి 80 లక్షల దాకా తమకు ఇవాల్సి ఉన్నప్పటికీ ఎన్నిసార్లు వారి చుట్టూ తిరిగిన డబ్బులు ఇవ్వకపోగా టిప్పర్ తో గుద్ది చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. అంతేకాకుండా రివాల్వర్ గన్ పెట్టి కాల్చిపడేస్తామని చెప్పి భయపెట్టారని కన్నీటి పర్యంతం అయ్యారు.

Also Read: పవన్ ఎంట్రీతో వీడిన మిస్సింగ్ మిస్టరీ.. 9 నెలలుగా ఆ యువతి ఎక్కడుందో తెలుసా?

ఇక ప్రభుత్వం మారిన తర్వాత వారు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా పోయారని వారి ఫోన్లు కూడా పనిచేయకుండా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. డబ్బులు అడిగిన సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేర్లను చెప్పి మేము వారి మనుషులము మమ్మల్ని డబ్బు అడుగుతావా అన్నట్టుగా కూడా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రస్తుతం అధికారులు దయ ఉంచి తమకు న్యాయం జరిగేలా చూడాలని రవీంద్రారెడ్డి దంపతులు వేడుకుంటున్నారు.

#ananthapur
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe