Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' నుండి మరో రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదుర్స్

రవితేజ 'మిస్టర్ బచ్చన్' నుంచి థర్డ్ సింగిల్ విడుదలైంది. 'జిక్కి' అంటూ సాగే ఈ సాంగ్ లో రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అదిరిపోయే విజువల్స్, క్లాస్ బీట్ తో ఆకట్టుకుంటున్న ఈ పాటను కార్తిక్‌, రమ్య బెహరా ఆలపించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించారు.

Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' నుండి మరో రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదుర్స్
New Update

Ravi Teja Mr.Bachchan Movie : మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' నుంచి కొత్త సాంగ్ విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ చిత్రానికి మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. విడుదలైన రెండు సింగిల్స్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ మూడవ సింగిల్ కూడా అదే జోరును కొనసాగిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు మూవీ థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు . 'జిక్కి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ రొమాంటికి మోడ్ లో ఉంది. ఈ సాంగ్‌లో రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అదిరిపోయే విజువల్స్, క్లాస్ బీట్ తో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్‌ని కార్తిక్‌, రమ్య బెహరా ఆలపించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించారు. ఈ సాంగ్ కాస్త సినిమాపై అంచనాలు పెంచేసింది.

Also Read : సమంత ముందే తెలుగులో పాట పాడి అదరగొట్టిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్

మిస్టర్ బచ్చన్ రొమాంటిక్ సాంగ్ 'జిక్కి' ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.

#mr-bachchan-movie #mr-bachchan-third-single
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe