Mr.Bachchan : హరీష్ శంకర్ కనిపిస్తే కొడతాం అంటున్న రవితేజ ఫ్యాన్స్.. వీడియో వైరల్

రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజై నెగెటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఓ రవితేజ అభిమాని హరీష్ శంకర్ కనిపిస్తే ఫ్యాన్స్ కొడతారని చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Mr.Bachchan : హరీష్ శంకర్ కనిపిస్తే కొడతాం అంటున్న రవితేజ ఫ్యాన్స్.. వీడియో వైరల్

Ravi Teja Fan : మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా నేడు (ఆగస్టు 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ కే సినిమా నచ్చలేదు. దీంతో డైరెక్టర్ హరీష్ శంకర్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ రవితేజ అభిమాని సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆ అభిమానిని సినిమా ఎలా ఉందని అడిగితే..' సినిమా యావరేజ్‌గా ఉంద‌ని.. హరీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం ఫ్లాప్ అయ్యింద‌ని తెలిపాడు. హరీశ్ శంక‌ర్ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి వ‌స్తే అభిమానులు ఆయన్ని కొడతారు. ర‌వితేజ అభిమానిగా చెబుతున్నా సినిమాలో కంటెంట్ ఉంది కానీ డైరెక్ష‌న్ మిస్ అయ్యింది.


Also Read : ఆ ఓటీటీలో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’.. స్ట్రీమింగ్ అప్పుడే?

పాట‌ల కోసం సినిమా తీసిన‌ట్లు ఉంది. స్టార్ ద‌ర్శకుడి అయ్యి ఇలా తీయ‌డం న‌చ్చలేదు. హరీశ్ శంక‌ర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి రాకండి.. ఒక‌వేళ మీరు ఇక్క‌డికి వ‌స్తే ఫ్యాన్స్ మిమ్మ‌ల్ని కొడతారు' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు