RTV Post Poll Study: ఏపీలో మారిన లెక్కలు.. గెలిచేది వారే.. రవిప్రకాష్ సంచలన పోస్ట్ పోల్ స్టడీ! ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీని రవిప్రకాష్ వెల్లడించారు. ప్రీ పోల్ స్టడీలో చెప్పినట్లుగా కూటమిదే విజయమని ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. అయితే.. పలు నియోజకవర్గాల్లో గెలుపోటముల పరిస్థితి మాత్రం మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చూడండి. By Nikhil 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి RTV పోస్ట్ పోల్ స్టడీలో షాకింగ్ విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సినారియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ తీరు చూస్తే ఫలితం రెండు రకాలుగా ఉండొచ్చని తేలింది. అందుకే RTV మీ ముందు రెండు అంచనాలని ఉంచబోతోంది. ఈ రెండు సినారియోలు షాకింగ్‌గానే ఉండబోతున్నాయి. మొదటి అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ సంచలన ఫలితాలే ఉండబోతున్నాయి. సినారియో-1: మా పోస్ట్ పోల్ స్టడీ, తొలి సినారియోలో టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. జనసేన 18, బీజేపీ 3 చోట్ల విజయకేతనం ఎగరేయబోతున్నాయి. ఇక వైసీపీ 53 స్థానాలు మాత్రమే గెలుస్తుంది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 స్థానాల్లో గెలుస్తుందని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఓవరాల్‌గా కూటమి 120 సీట్లు దక్కించుకోబోతోంది. ఓవరాల్‌గా పోలింగ్‌కు ముందు RTV స్టడీలో ఏం చెప్పామో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారైంది అన్న వివరాల్లోకి వెళ్తే.. ప్రీ పోల్ స్టడీలో టీడీపీ 95, జనసేన 13, బీజేపీ 3 చోట్ల గెలుస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక్క చోట గెలుస్తుందని చెప్పాం. ఇక పోస్ట్ పోల్ స్టడీలో టీడీపీ 99, జనసేన 18, బీజేపీ 3 సీట్లు గెలుస్తాయని తేలింది. వైసీపీ 53 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందనే విషయం స్పష్టమైంది. అంటే టీడీపీకి 4, జనసేనకి 5, కాంగ్రెస్‌కు ఒక్క స్థానం పెరిగాయి. సినారియో-2: మనం ముందే అనుకున్నట్టు రెండో సినారియో అందరికీ షాకింగ్‌గానే ఉండబోతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మా పోస్ట్ పోల్ స్టడీలో సెకండ్ సినారియో ప్రకారం టీడీపీ కూటమి 150 స్థానాల్లో గెలవబోతోంది. వైసీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుస్తుంది. కాంగ్రెస్ 2 చోట్ల గెలుస్తుంది. మొత్తంగా RTV 2 సినారియల్లోనూ టీడీపీ కూటమికి అనుకూల ఫలితమే వస్తుందని తేలింది. కారణాలు: టీడీపీకి 150కి పైగా సీట్లు వచ్చేలా వేవ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కామన్ పబ్లిక్‌లో పెద్దగా కనిపించకపోయినా పార్టీ కేడర్‌ను మాత్రం తీవ్రంగా కదిలించింది. తమ నాయకుడిని జైలుకు పంపిన వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ కేడర్‌లో కనిపించింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ లేని విధంగా ఎలక్షనీరింగ్‌లో పైచేయి సాధించారు. వీరికి జనసేన, బీజేపీ నుంచి మంచి మద్దతు వచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి వేవ్ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ : పైగా జగన్‌పై నాలుగు అంశాల్లో జనంలో స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెలుపోటములను మార్చేసింది. తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్లిపోతాయన్న భయం జనంలో ఉంది. పాస్‌బుక్‌లపై జగన్ ఫొటోలు వేసుకోవడంతో జనంలో అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఇది జగన్‌పై వ్యతిరేకతకు దారితీసింది. లిక్కర్ (LIQUOR): మద్యం అమ్మకాలు వైసీపీ ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్‌గా కనిపిస్తున్నాయి. చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు చాలా నెగెటివ్ ఇంపాక్ట్‌ను చూపించాయి. కుటుంబ పెద్ద సంపాదన అంతా మద్యానికే సరిపోతోందన్న ఆందోళన మహిళల్లోనూ స్పష్టంగా ఉంది. రోడ్లు: రోడ్లు దారుణంగా ఉండటం బలమైన నెగెటివ్ ఇంపాక్ట్‌కు కారణమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో రోజూ పెద్ద పెద్ద గుంతల రోడ్లతో ఈ ఐదేళ్లు నరకం చూశామన్న ఆవేదన మెజార్టీ జనంలో ఉంది. అదే వైసీపీకి అతిపెద్ద మైనస్‌గా మారింది. ఇళ్ల స్థలాలు: ఇళ్లు, ఇళ్ల స్థలాల అంశం పాజిటివ్ అవుతుందని వైసీపీ భావిస్తున్నా గ్రౌండ్‌లో అందుకు భిన్నమైన ట్రెండ్ ఉంది. 60 గజాల స్థలాలే ఇవ్వడం, అదీ ఊరుకి దూరంగా, మునిగిపోయే చోట ఇచ్చారనే తీవ్ర అసంతృప్తి మహిళల్లో చాలా చోట్ల కనిపించింది. ఈ అంశాలన్నీ జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో నెగెటివ్‌ను క్రియేట్ చేశాయి. మహిళల ఓట్లు: మహిళా ఓటు గురించిన చర్చ ఏపీ రాజకీయ పక్షాల మధ్య తీవ్రంగా జరుగుతోంది. మహిళలు విపరీతంగా ఓటు వేశారని, వారు అధికార పక్షం వైపు ఓట్లు కురిపించారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంలో వాస్తవాలు ఓ సారి చూద్దాం. ఏపీలో 24 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 2019 ఓటింగ్ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఇదే వాదన వినిపించారు. కానీ ఫలితం మరో రకంగా కనిపించింది. అధికార వైసీపీ మద్యం పాలసీ మహిళల్ని బాగా ఆందోళనకు గురిచేస్తుందన్నది వాస్తవం. ఇదే వ్యతిరేకత మహిళా ఓటర్లలో వ్యక్తమయిందని RTV స్టడీలో తేలింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి