Rave Party vs Political Parties: రేవ్ పార్టీ.. సాధారణంగా ఈ పేరుతో ఎప్పుడైనా వార్తలు వస్తే అవి సెలబ్రిటీల చుట్టూ తిరిగేవి. గతంలో హైదరాబాద్ లో ఎక్కువగా రేవ్ పార్టీల మాట వినిపించేది. పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో అవి ఇప్పుడు బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాయి. తాజాగా బెంగళూరు శివార్లలో నిర్వహించిన రేవ్ పార్టీ రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. రేవ్ పార్టీపై పోలీసుల దాడి జరిగిన దగ్గర నుంచి.. అందులో ఎవరు పాల్గొన్నారు? ఎవరి నిర్వహణలో ఇది జరిగింది? అనే ప్రశ్నల కోణంలో విపరీతమైన సంచలనాలు చోటు చేసుకున్నాయి. సహజంగానే ఒకరిద్దరు సెలబ్రిటీల పేర్లు ముందు బయటకు వచ్చాయి. అయితే, వాటితో పాటు ఏపీ మంత్రి పేరు కూడా బయటకు రావడం సంచలనంగా మారింది. ఆయన పేరుతో స్టిక్కర్ ఉన్న కారు సంఘటనా స్థలం వద్ద కనిపించడంతో ఈ రేవ్ పార్టీ వ్యవహారం పొలిటికల్ పార్టీల మధ్య వార్ గా మారిపోయింది.
పూర్తిగా చదవండి..Rave Party vs Political Parties: రేవ్ పార్టీ.. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టుల రేవు పెట్టుకుంటున్న పార్టీలు!
బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఉదంతం సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తే.. ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. రేవ్ పార్టీ వెనుక మీ నాయకులు ఉన్నారని ఒకరు.. కాదు మీ నేతలే ఉన్నారని మరొకరు ఇలా సోషల్ మీడియాలో వైసీపీ-టీడీపీ శ్రేణులు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
Translate this News: