Home Tips: ఇంట్లో ఎలుకలు ఉండటం ఒక సాధారణ సమస్య. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరి ఇంట్లో ఎలుకలు ఇంట్లో భీభత్సాన్ని సృష్టించాయి. కాబట్టి ఇంటి నుంచి ఎలుకలను తరిమివేయాలనుకుంటే కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఎలుక ఇంట్లోకి రాకుండా పోతుంది. ఈ నివారణల వల్ల అవి పారిపోతాయి. ఎలుకలను తరిమిసే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఎలుకలను తరిమిసే ఇంటి చిట్కాలు:
- ఇంట్లో నుంచి ఎలుకలను తరిమికొట్టడానికి ఉల్లిపాయలను కత్తిరించి ఎలుకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచాలి. ఎందుకంటే ఎలుకలు ఉల్లిపాయల వాసనను ఇష్టపడవు.
- లవంగాలు, ఏలకుల వాసన ఎలుకలను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఎలుకలు ఎక్కువగా ఉన్న చోట ఏలకులు, లవంగాల ముక్కలను ఉంచాలి.
- ఎలుకలు ఇంట్లోకి వచ్చే అన్ని ప్రదేశాలపై పిప్పరమెంటు నూనెను పిచికారీ చేయాలి. ఎందుకంటే ఎలుకలు పుదీనా వాసనను ఇష్టపడవు.
- అంతేకాకుండా ఎలుకలు ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో మిరపకాయ, వెల్లుల్లి ద్రావణాన్ని కూడా పూయవచ్చు. ఘాటైన వాసన వల్ల ఎలుక ఇంట్లోకి రాదు.
- అమ్మోనియా వాసన నుంచి ఎలుకలు కూడా పారిపోతాయి. అమ్మోనియాను ఒక గిన్నెలో ఉంచి ఎలుకలు ఎక్కువగా సందర్శించే ప్రదేశంలో ఉంచాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: రోజుకి 14 గంటలు పని చేస్తున్నారా? జరిగిది ఇదే!