Breaking : తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్యుడికి కేంద్రం నుంచి ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. దేశంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను కొంతమేర తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ల ధరపై రూ.19 తగ్గించాయి.

Breaking : తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!
New Update

Gas Cylinder Price : దేశంలో ఎన్నికలు(Elections) సమీపిస్తున్న తరుణంలో సామాన్యుడికి కేంద్రం నుంచి ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. దేశంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు(Oil Marketing Companies) వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను కొంతమేర తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌(Commercial LPG Cylinder) ల ధరపై రూ.19 తగ్గించాయి. మే 1 బుధవారం నుండి తగ్గించిన ధరలు అమలులోకి రానున్నయని వివరించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ. 1,745.50కు తగ్గింది. గతంలో ఢిల్లీ(Delhi) లో 19 కిలోల సిలిండర్ ధర రూ.1764.50గా ఉంది.

తగ్గిన ధరలతో ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర ఎలా ఉన్నాయంటే.. ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1698.50గా ఉంది, చెన్నైలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1911గా ఉండగా... కోల్ కతాలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1859గా ఉంది.

గత నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరపై రూ. 30.50 తగ్గించాయి. మార్చిలో రూ. 25.50, ఫిబ్రవరిలో రూ. 14 పెంచగా.. జనవరి 1న వాణిజ్య సిలిండర్ల ధరపై రూ. 1.50 స్వల్పంగా తగ్గించాయి.

Also read: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య..48 గంటల్లో రెండోది!

#gas-cylinder-price #oil-marketing-companies #lpg
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe