Bapatla Rape: బాపట్లలో యువతి అత్యాచారం, హత్య.. నిందితులు అరెస్ట్

AP: బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన 48 గంటల్లో నిందితుల్ని పట్టుకున్నారు. నిందితులు దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

New Update
Bapatla Rape: బాపట్లలో యువతి అత్యాచారం, హత్య.. నిందితులు అరెస్ట్

Bapatla Rape: బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన 48 గంటల్లో నిందితుల్ని పట్టుకున్నారు. ఈపురుపాలెం ఓడరేవు వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు. డీజీపీతో మాట్లాడి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సీఎం తెలుసుకున్నారు. సీఎం పర్యవేక్షిస్తుండటంతో వేగంగా అధికారులు పనిచేశారు.

నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలు రంగంలోకి దింపారు. నిందితులు దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ గా గుర్తించారు. ముగ్గురు నిందితులు ఈపురుపాలెం గ్రామస్తులని తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన యువతిని పొదల్లోకి లాక్కెల్లి అత్యాచారం చేసి, హత్య చేశారు ఈ ముగ్గురు కీచకులు.

Also Read: ఓరి వీడి ఏశాలో.. టూరిస్టులను వ్యభిచారులుగా పరిచయం చేస్తూ రీల్స్.. నెటిజన్స్ ఫైర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు