Ranveer Singh: ఇప్పుడేమైంది బ్రో...ఎరక్కపోయి..ఇరుక్కున్న రణవీర్ సింగ్..!!

మాల్దీవుల వివాదంలో అడ్డంగా బుక్కయ్యారు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్. లక్షద్వీప్ ను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేసేందుకు ముందుకు వవచ్చి...ఓ పొరపాటు చేశాడు. లక్షద్వీప్ ఫొటోకు బదులు మాల్దీవుల ఫొటోను షేర్ చేశాడు. ఆ రెండు ప్రాంతాల మధ్య తేడా కూడా తెలియదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Star Hero: నాడు సినిమా సెట్ నుంచి వెళ్లగొట్టారు..నేడు టాప్ హీరోగా ఎదిగాడు !
New Update

ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవులు మంత్రులు చేసిన వివాదస్పద ట్వీట్స్ కారణంగా భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాల్దీవులను బాయ్ కాట్ చేయాలని భారతీయులు పిలుపునిస్తూ లక్షద్వీప్ కు మద్దతు తెలుపుతున్నారు. క్రికెటర్లతోపాటు సినీనటులు కూడా #BoycottMaldives ట్రెండ్ లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో లక్షద్వీప్ అందాలను కొనియాడుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా లక్షద్వీప్ ను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే రణ్ వీర్ సింగ్ అనుకోకుండా ఓ పొరపాటు కూడా చేశాడు. అందుకు అతను నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.

ఈ ఏడాదిలో లక్షద్వీప్ ను అన్వేషించాలని..మన భారతీయ సంస్క్రుతిని ప్రోత్సహించాలని అభిమానులను రణ్ వీర్ సింగ్ కోరుతూ...మాల్దీవులకు చెందిన ఫొటోను షేర్ చేశారు. ఇదే అతను చేసిన బిగ్ మిస్టేక్. లక్షద్వీప్ ఫొటోకు బదులు మాల్దీవుల ఫొటోను షేర్ చేయడంతో ఆ రెండు ప్రాంతాల మధ్య తేడా తెలియదా అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లతో ఆడుకుంటున్నారు. ఈ ఏడాదిలో భారతదేశాన్ని అన్వేషించడంతోపాటు మన సంస్క్రతి అనుభూతి ఆస్వాదిద్దాం. మనదేశంలో అన్వేషించేందుకు ఎన్నో అందాలు, బీచ్ లు ఉన్నాయి. చలో ఇండియా లెట్స్ #exploreindianislands’’ అంటూ రణ్ వీర్ సింగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే నెటిజన్లు మాత్రం ఈ పోస్టును పట్టించుకోకుండా పొరపాటుగా అతను పెట్టిన మాల్దీవుల ఫొటోనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

అటు మాల్దీవులకు చెందిన మంత్రి మరియం షియునా కాంట్రవర్సియల్ కామెంట్ పై భారతీయులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. భారతీయ కల్చర్, నాయకులను కించపరిచారంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. 

ఇది కూడా చదవండి: చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం బీజేపీలో లొల్లి..

ఇక అసలు విషయానికొస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల లక్షదీవులను సందర్శించిన విషయం తెలిసిందే. కాగా ‘ఇండియన్ పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తారు. అక్కడి రోడ్లు సక్రమంగా ఉండవు. ఇదీ.. మీకల్చర్’ అంటూ మోడీని ట్యాగ్ చేస్తూ  మాల్దీవులకు చెందిన మంత్రి మరియం షియునా ట్వీట్ చేశారు. ఇది వైరల్ కావడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, నటి పూనమ్ పాండే స్పందించారు.

#ranveer-singh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe