ఆజంఖాన్‌కు షాక్.. రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా..!!

విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‎వాదీ పార్టీ నేత ఆజంఖాన్‎కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను దోషిగా కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్ల జైలు శిక్షతోపాటు 2,500రూపాయల జరిమానా విధించింది రాంపూర్ కోర్టు. ఏప్రిల్ 18, 2019 న, ధమర గ్రామంలో జరిగిన బహిరంగ సభలో విద్వేషభరితమైన ప్రసంగం చేసినందుకు ఆజంఖాన్ పై కేసు నమోదు అయ్యింది. అప్పట్లో ఈ ప్రసంగానికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.

ఆజంఖాన్‌కు షాక్.. రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా..!!
New Update

విద్వేషపూరిత ప్రసంగాల కేసులో ఎస్పీ నేత ఆజం ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. కోర్టు ఆజం ఖాన్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రెండున్నర వేల రూపాయల జరిమానా విధించింది. శిక్షపై ఆజం ఖాన్ తరపు న్యాయవాది, ప్రాసిక్యూషన్ తరఫు వాదనలు వినిపించారు. ఆజం ఖాన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

publive-image

ఏప్రిల్ 18, 2019న, ధమర గ్రామంలో జరిగిన బహిరంగ సభలో యూపీ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్, అప్పటి కలెక్టర్ ఆంజేనేయకుమార్ సింగ్ పై ఆజంఖాన్ విద్వేంశాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారు. దీనికి సంబందించి పోలీసులు సెక్షన్ 153ఏ ( రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచినందుకు) , సెక్షన్ 505-1 ( దుష్ప్రచారాన్ని చేసినందుకు) వంటి సెక్షన్ల కింద ఆజం ఖాన్ పై రాంనగర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 125కింద కూడా కేసు నమోదు చేశారు.

ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఏడీఓ కోఆపరేటివ్ అనిల్ చౌహాన్ షాజాద్‌నగర్‌లో ఆజం ఖాన్‌పై కేసు పెట్టారు. పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణ తర్వాత, శనివారం ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆజం ఖాన్‌ను దోషిగా నిర్దారించింది కోర్టు. ఆజం ఖాన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. రు వైపుల వాదనలు విన్న కోర్టు ఆజం ఖాన్ ను దోషిగా నిర్దారిస్తూ... రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2,500 జరిమానా విధించింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe